తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై మరోసారి కేంద్ర హోంశాఖ సమావేశం
- November 08, 2022
న్యూఢిల్లీ: ఈ నెల 23న కేంద్ర హోంశాఖ తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై సమావేశం నిర్వహించనున్నది. హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా నేతృత్వంలో భేటీ జరుగనున్నది. ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సమాచారం పంపిన హోంశాఖ.. భేటీకి తప్పనిసరిగా రావాలని కోరింది. భేటీలో విభజన సమస్యలపై పూర్తిస్థాయిలో చర్చించాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తున్నది. ఇంతకు ముందు సెప్టెంబర్ 27న భేటీలో ఏడు ఉమ్మడి అంశాలపై కేంద్రం చర్చించింది. ఏపీకి సంబంధించి ఏడు అంశాలపై కేంద్ర అధికారులు చర్చించారు. విభజన చట్టంలో పేర్కొన్న హామీలు, అంశాలు పదేళ్ల లోపు పూర్తి చేయాలని నిబంధన ఉన్న విషయం తెలిసిందే.
ఆ నిబంధనకు అనుగుణంగా రెండేళ్లలో చట్టం అమలులోకి వచ్చి పదేళ్లు పూర్తి కానున్నది. గత ఎనిమిదేళ్లు పలు సమస్యలు ఇంకా పెండింగ్ ఉన్న నేపథ్యంలో ఈ సమస్యలను పరిష్కరించాలని, తెలుగు రాష్ట్రాల మధ్య ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని భావిస్తున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 27న జరిగిన సమావేశంలో ఎలాంటి నిర్ణయాలపై ఏ కొలిక్కి రాలేదు. అలాగే ఈ సారి ఏపీ రాజధాని అంశాన్ని సైతం సమావేశం ఎజెండాలో ప్రస్తావించారు. అమరావతికి రైల్వే కనెక్టివికి సంబంధించిన అంశాలను ఎజెండాలో కేంద్రం చేర్చింది. గత సమావేశంలో జరిగిన 14 అంశాలతోనే మరోసారి భేటీ జరుగనున్నది.
తాజా వార్తలు
- భారత్ లో 100 కొత్త ఎయిర్పోర్టులు..కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
- బాలకృష్ణకు అరుదైన గౌరవం- లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రదానం
- ఇరాన్ ఆయిల్ వార్తలపై రిలయన్స్ క్లారిటీ
- భద్రాద్రి పునర్నిర్మాణ ఆలయ నమూనా
- ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎంఎంటీఎస్ సేవలు: సీఎం రేవంత్
- అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేబినెట్ తీర్మానం
- రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ కీలక సమావేశం
- కువైట్ లో ఉగ్రవాద కుట్ర భగ్నం..హిజ్బుల్లా నెట్వర్క్ బస్ట్..!!
- రుస్తాఖ్ ఆసుపత్రికి ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్ట్ సక్సెస్..!!
- ముహర్రాక్ ఫెసిలిటీలో అగ్నిప్రమాదం..!!









