తెలంగాణలో కరీంనగర్ సహా పలు ప్రాంతాల్లో ఈడీ, ఐటీ సోదాలు
- November 09, 2022
హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక తర్వాత ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఐటీ శాఖలు తెలంగాణలో దూకుడు పెంచాయి. బుధవారం రాష్ట్రంలోని పలు చోట్ల ఈడీ, ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వివిధ కేసుల నిమిత్తం ఈడీ అధికారుల బృందాలు ఈ ఉదయమే ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నాయి. దాదాపు 30 బృందాలు హైదరాబాద్ తో పాటు కరీంనగర్ లో సోదాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఐటీ శాఖ అధికారులు తోడుగా హైదరాబాద్ లోని సోమాజిగూడ, అత్తాపూర్ లో పలువురు గ్రానైట్ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ దాడులు నిర్వహిస్తోంది. కరీంనగర్ లోని గ్రానైట్ వ్యాపారులే లక్ష్యంగా సోదాలు చేస్తున్నాయి. క్వారీ నిర్వాహకులు ఫెమా నిబంధనలు ఉల్లఘించారని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఆ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాలు, వ్యాపార సముదాయాలపై దాడులు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
-నారాయణ గుళ్ళపల్లి(మాగల్ఫ్ ప్రతినిధి,కరీంనగర్)
తాజా వార్తలు
- పుణే యూనివర్సిటీ, ఖతార్ క్యాంపస్ మొదటి బ్యాచ్ ప్రారంభం..!!
- పలు అంశాలపై చర్చించిన ఒమన్, బహ్రెయిన్..!!
- నవంబర్ 25 నుండి అరబ్ జ్యువెల్లరీ ఎగ్జిబిషన్..!!
- ఆధునిక సౌకర్యాలతో షువైక్ బీచ్ రెడీ..!!
- న్యూయార్క్ లో సౌదీ, భారత విదేశాంగ మంత్రులు భేటీ..!!
- కనువిందు..బుర్జ్ ఖలీఫాపై కోల్కతా ఫెస్టివల్ థీమ్..!!
- ఆసియా కప్ విజేతగా భారత్
- టీ-చిప్ సెమీకాన్ కానిస్టిట్యూషన్ సమ్మిట్ ఘనవిజయం
- పవన్ కల్యాణ్ ,చంద్రబాబు సమావేశం ముగింపు..
- NATS మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం