ప్రధాని మోడీ వైజాగ్ టూర్ షెడ్యూల్ లో మార్పులు
- November 09, 2022
న్యూ ఢిల్లీ: ప్రధాని మోడీ ఈ నెల 12 న ఏపీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 11న సాయంత్రం మధురై విమానాశ్రయం నుంచి బయల్దేరి రాత్రి 7.25 గంటలకు విశాఖ విమానాశ్రయానికి ఆయన చేరుకుంటారు. రాత్రికి చోళ షూట్ లో బస చేస్తారు. 12 తేదీ ఉదయం చోళ షూట్ నుంచి ఆంధ్ర యూనివర్శిటీకి చేరుకుంటారు. అక్కడి నుంచే రూ. 10,742 కోట్ల విలువైన 7 కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటు… ఇప్పటికే పూర్తయిన రెండు ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. అయితే ఇప్పుడు ఈ షెడ్యూల్ లో చిన్న మార్పు చోటుచేసుకున్నట్లు తెలుస్తుంది.
మోడీ వైజాగ్ టూర్ లోకి ఇప్పుడు అనూహ్యంగా రోడ్ షో వచ్చి చేరింది. ప్రధాని మోడీ ఎల్లుండి విశాఖకు రాగానే నగరంలో సాయంత్రం రోడ్ షో నిర్వహించేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. తద్వారా ప్రధాని మోడీ విశాఖకు, అలాగే ఏపీకి చేస్తున్నసాయాన్ని చెప్పుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముందు ప్రకటించిన షెడ్యూల్లో ఈ రోడ్ షో లేదు. కానీ చివరి నిమిషంలో బీజేపీ నేతలు పట్టుబట్టి దీన్నిచేర్పించినట్లు తెలుస్తోంది. ప్రధాని విశాఖ చేరుకోగానే రోడ్ షో ఉంటుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఈరోజు ప్రకటించారు. మోడీ తన టూర్ లో ఏడుకీలక ప్రాజెక్టులకు శంఖుస్ధాపన చేయబోతున్నారు. వీటిలో పలు రోడ్డు ప్రాజెక్టులు ఉన్నాయి. అయితే కీలకమైన విశాఖ రైల్వే జోన్ కు మాత్రం ప్రధాని శంఖుస్ధాపన చేయడం లేదు. ఈ విషయాన్ని కూడా బీజేపీ ఎంపీ జీవీఎల్ తన ప్రెస్ మీట్లో వెల్లడించారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







