ప్రపంచ కప్ అభిమానుల కోసం ‘ఒమన్ ఎయిర్’ ప్రత్యేక ధరలు
- November 09, 2022
ఒమన్: ఖతార్ ఫుట్‌బాల్ మ్యాచులను చూసే జీసీసీ దేశాల అభిమానుల కోసం ఒమన్ సుల్తానేట్ జాతీయ విమానయాన సంస్థ అయిన ఒమన్ ఎయిర్ ప్రత్యేక ఛార్జీలను ప్రకటించింది. GCC జాతీయులు, నివాసితులు అందరూ ప్రత్యేక ధర కలిగిన టిక్కెట్లను ఎకానమీ క్లాస్‌కు కేవలం OMR 149, బిజినెస్ క్లాస్ కోసం OMR 309 వద్ద కొనుగోలు చేయవచ్చని ప్రకటించింది. మస్కట్ మీదుగా విమానాలను ఎంచుకునే ఫుట్‌బాల్ అభిమానులు ఒమన్ ఎయిర్ రోజువారీ మ్యాచ్ డే షటిల్ ఫ్లైట్లలో ఒకదానిలో కేవలం OMR 49 రిటర్న్‌తో మ్యాచ్‌కి వెళ్లవచ్చు. మస్కట్ -దోహాల మధ్య 21 నవంబర్ నుండి 3 డిసెంబర్ 2022 వరకు షటిల్ సర్వీసులు పనిచేయనున్నాయి. ఎయిర్ టిక్కెట్లను బుక్ చేసుకునే అతిథులు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే హయ్యా కార్డ్, మ్యాచ్ టిక్కెట్‌ని కలిగి ఉండాలి. ఇతర నిబంధనలు, షరతులు కోసం వెబ్ సైట్ http://www.omanair.com ను చూడాలని సూచించింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా ఐపీఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ బతుకమ్మ సంబరాలు
- ఫ్యూచర్‌సిటీకి కొత్త పోలీస్ కమిషనరేట్.. ప్రారంభించిన సీఎం రేవంత్
- మలేషియాలో ఘనంగా MYTA 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
- దుబాయ్‌లో నకిలీ అనారోగ్య సెలవు ధ్రువపత్రాల జారీ.. క్లినిక్ క్లర్క్‌కు జైలు శిక్ష
- నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే వీల్ క్లాంప్లు..!!
- డిజిటల్, ఏఐ రంగాల్లో సహకారంపై బహ్రెయిన్, సౌదీ చర్చలు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచే ప్రయత్నాలు..యూఏఈ హెచ్చరిక..!!
- ఇంటర్నెట్ భద్రతలో ప్రపంచంలోనే నంబర్ వన్‌గా సౌదీ అరేబియా..!!
- ఖతార్‌లో రియల్ ఎస్టేట్ విక్రయాలు QR696.5 మిలియన్లు..!!
- ఒమన్‌లో రోడ్డుపై ప్రమాదకర స్టంట్లు.. డ్రైవర్ అరెస్ట్..!!







