దుబాయ్ లో ఘనంగా గురునానక్ 553వ జయంతి వేడుకలు

- November 09, 2022 , by Maagulf
దుబాయ్ లో ఘనంగా గురునానక్ 553వ జయంతి వేడుకలు

దుబాయ్: సిక్కు మత స్థాపకుడు.. 10 మంది గురువులలో మొదటి వ్యక్తి అయిన గురునానక్ దేవ్‌జీ 553వ జయంతిని నవంబర్ 8న జెబెల్ అలీలోని సిక్కు దేవాలయం గురునానక్ దర్బార్‌లో ఘనంగా జరుపుకున్నారు. ఉదయం 4.30 నుండి రాత్రి 9 గంటల వరకు ప్రత్యేక ప్రార్థనలలు నిర్వహించారు.రోజంతా లంగర్ (భోజనాలు) వడ్డించారు. ప్రముఖ రాగి జాతా భాయ్ హర్జిందర్ సింగ్ శ్రీనగర్‌వాలే, వీర్ మన్‌ప్రీత్ సింగ్ జీ, అనేక ఇతర ప్రముఖ సిక్కు మత గాయకులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా దుబాయ్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా కాన్సుల్ జనరల్ డాక్టర్ అమన్ పూరి, చండీగఢ్ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ సత్నామ్ సింగ్ సంధు, ఛాన్సలర్ హిమానీ సూద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సురేందర్ కంధారి మాట్లాడుతూ.. గురునానక్ జయంతిని పురస్కరించుకుని నవంబర్ 11న అబుదాబిలోని ఇండియా సోషల్ & కల్చరల్ సెంటర్‌లో ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2.30 వరకు ప్యాక్డ్ లాంగర్‌ తోపాటు నవంబర్ 13న ఉదయం 4.30 నుండి రాత్రి 9 గంటల వరకు గురునానక్ దర్బార్ జెబెల్ అలీ దుబాయ్‌లో గురుపురబ్ వేడుకలు కొనసాగుతాయని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com