ఒమన్‌లో VOX సినిమాస్ మూసివేత
- November 10, 2022
మస్కట్: ఒమన్ లో అతిపురాతనమైన సినిమా హాల్‌లో ఒకటైన VOX సినిమాస్ మూసివేశారు. చివరిసారిగా పదిరోజుల క్రితం సినిమాను ప్రదర్శించారు. 'జయ జయ జయ జయ హే' అనే మలయాళ చిత్రాన్ని రూవిలోని VOX సినిమాస్ థియేటర్ లో అక్టోబర్ 31 ప్రదర్శించారు. థియేటర్‌ను పునరుద్ధరించే ప్రణాళికలు పూర్తయ్యే వరకు VOX సినిమా హాళ్లను మూసివేయనున్నట్లు VOX సినిమాస్‌ని నిర్వహిస్తున్న మాజిద్ అల్ ఫుట్‌టైమ్ లీజర్, ఎంటర్‌టైన్‌మెంట్ & సినిమాస్ ప్రకటించింది. జవాద్ సుల్తాన్ గ్రూప్‌తో తమ ఐదేళ్ల ఒప్పందం అక్టోబర్ 31న ముగియడంతో ఐదు థియేటర్లను మూసివేయాలని నిర్ణయించినట్లు తెలిపింది. కాగా, సిటీ సెంటర్, ఖురమ్, అజైబా మాల్, ఎంజీఎ:, మాల్ ఆఫ్ ఒమన్‌లలో సినిమాల ప్రదర్శన కొనసాగుతోందని పేర్కొంది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







