రియాద్‌లో ఒబామాని కలిసిన మొహమ్మద్‌

- April 22, 2016 , by Maagulf
రియాద్‌లో ఒబామాని కలిసిన మొహమ్మద్‌

క్రౌన్‌ ప్రిన్స్‌ ఆఫ్‌ అబుదాబీ మరియు డిప్యూటీ సుప్రీం కమాండర్‌ ఆఫ్‌ ది యూఏఈ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌, రియాద్‌లో అమెరికా అధ్యక్షుడు బారక్‌ ఒబామాని రిసీవ్‌ చేసుకున్నారు. ఇరు దేశాల మధ్య సహాయ సహకారాలపై ఇరువురు నాయకులూ చర్చించారు. గురువారం జరిగే జిసిసి - అమెరికా సమావేశంలో పాల్గొనేందుకు సౌదీ అరేబియా వచ్చారు ఒబామా. ఇరు దేశాలకు సంబంధించిన విషయాలతోపాటు, ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరిణామాలపైనా ఇరు దేశాల నేతల మధ్యా చర్చలు జరిగాయి. తీవ్రవాదం, హింస వంటి అంశాల గురించి షేక్‌ మొహమ్మద్‌, ఒబామా వద్ద ప్రస్తావించారు. అంతర్జాతీయ స్థాయిలో తీవ్రవాదం పెను ప్రమాదంగా మారిందని షేక్‌ మొహమ్మద్‌, ఒబామా దృష్టికి తీసుకువచ్చారు. తీవ్రవాదాన్ని తుదముట్టించే క్రమంలో ప్రపంచ దేశాలన్నీ ఒక్కతాటిపైకి రావాలని షేక్‌ మొహమ్మద్‌, ఒబామా అభిప్రాయపడ్డారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com