క్వీన్ ఎలిజబెత్ 90వ పుట్టినరోజు గుర్తుగా స్మారక ఆల్బమ్...
- April 22, 2016
క్వీన్ ఎలిజబెత్ 90వ పుట్టినరోజు వేడుకలకు గుర్తుగా ఎయిర్ ఇండియా ఓ అధికారిక స్మారక ఆల్బమ్ ను వెలువరించనుంది. ప్రచురణకర్త సెయింట్ జేమ్స్ హౌస్ ద్వారా ఆల్బమ్.. ఈ వారం విడుదల కానుంది. లండన్ లోని విండర్స్ కాసిల్ హోం పార్క్ లో మే 12-15 మధ్య జరిగే రాయల్ ఈవెంట్స్ సందర్భంలో పంపిణీకి ప్రణాళికలు సిద్ధం చేసింది.క్వీన్ ఎలిజబెత్ రాచరికపు జీవితంపై లండన్ లో నాలుగు రోజులపాటు నిర్వహించనున్న వేడుకల్లో కామన్వెల్త్, అంతర్జాతీయ వ్యవహారాల్లో ఆమె అంకితమైన తీరు, సాయుధ దళాలపై సారించిన దృష్టి, గుర్రాలపై చూపించిన ప్రేమ తదితర విషయాలు ప్రముఖంగా ఉంటాయని తెలుస్తోంది. కార్యక్రమానికి హాజరయ్యే వీవీఐపీ, వీఐపీలకు స్మారక ఆల్బమ్ ను బహుమతిగా ఇవ్వనున్నట్లు సెయింట్ జేమ్స్ హౌస్ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్ ఫ్రీడ్ తెలిపారు. అంతేకాకుండా ప్రపంచ ప్రముఖులు, సంస్థలు, రాష్ట్ర అధిపతులు, నాయకులు, పారిశ్రామిక వేత్తలకు ఈ పుస్తకాల కాపీలు అందజేయనున్నట్లు చెప్పారు. ఆల్బమ్ సంపాదకీయ భాగస్వాముల కోసం వెతుకుతున్నపుడు తమకు ఎయిర్ ఇండియా యూకె సహకరించేందుకు ముందుకు వచ్చిందని, అదే తమకు మైలురాయిగా చెప్పాలని ఫ్రీడ్ తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







