అలెప్పో పరిసర ప్రాంతాల్లో యుద్ధ విమానాలు బాంబుల వర్షం..
- April 22, 2016
సిరియాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఆధీనంలోకి తీసుకున్న అలెప్పో నగరం, పరిసర ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 9 మంది పౌరులు మృతిచెందగా, డజన్ల మంది గాయాలపాలైనట్లు స్థానిక పౌరరక్షణ అధికారులు వెల్లడించారు. సిరియాలోని బ్రిటన్‌కు చెందిన మానవ హక్కుల పరిరక్షణ సంస్థ మాత్రం పది మంది పౌరులు మరణించినట్లు తెలిపింది.అలెప్పో పరిసర ప్రాంతాల్లో బస్టన్ అల్-ఖసర్, అల్-మషద్ జిల్లాలో యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని మానవ హక్కుల సంస్థ పేర్కొంది. సిరియాలో గత కొన్నేళ్లుగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకొని అరాచకాలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







