విజిట్ వీసా పునరుద్ధరణకు ఆరోగ్య బీమా కవరేజ్ తప్పనిసరి
- November 12, 2022
రియాద్: విజిట్ వీసాల పునరుద్ధరణకు కొత్త ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందని సౌదీ అరేబియా హెల్త్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ తెలిపింది. విజిట్ వీసా పొడిగించిన కాలానికి కొత్త బీమా కవరేజీని తప్పనిసరిగా పొందాలని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్ (జవాజత్) తన ట్విట్టర్ ఖాతాలో తెలిపింది. తవునియా, బుపా, మెడ్గల్ఫ్, గల్ఫ్ యూనియన్, అరేబియా షీల్డ్ కోఆపరేటివ్ ఇన్సూరెన్స్, అరేబియా కోఆపరేటివ్ ఇన్సూరెన్స్, అల్-ఎతిహాద్ కోఆపరేటివ్, అల్-సాగ్ర్ కోఆపరేటివ్ హెల్త్ ఇన్సూరెన్స్, AXA కోఆపరేటివ్, అలైడ్ కోఆపరేటివ్ ఇన్సూరెన్స్ వంటి లైసెన్స్ పొందిన బీమా కంపెనీల ద్వారా ఆరోగ్య బీమా కవరేజీని పొందాలని సూచించింది. సింగిల్ ఎంట్రీ విజిట్ వీసాల గడువును మూడు నెలలకు పొడిగించేందుకు మంగళవారం మంత్రి మండలి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఎలాంటి రుసుము లేకుండా ట్రాన్సిట్ వీసాల బస వ్యవధి కూడా 96 గంటలకు పొడిగించబడింది. వీసా నిబంధనల్లో సవరణల ప్రకారం.. సింగిల్ ఎంట్రీ ఫ్యామిలీ విజిట్ వీసాలు 30 రోజులు చెల్లుబాటు అవుతుండగా.. మల్టిపుల్ ఎంట్రీ వీసాలు 90 రోజులు చెల్లుబాటు అవుతాయని జవాజత్ పేర్కొంది.
తాజా వార్తలు
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి
- నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు (బాలల) నిర్వహణ తేదీల మార్పు
- భారత్–న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచే FTA అమలు
- ఫ్లైదుబాయ్ విమాన ఘటన పై స్పందించిన భారత పైలట్ స్మిత్ మచ్చర్
- దుబాయ్‌లో ఘనంగా ఐపీఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ బతుకమ్మ సంబరాలు
- ఫ్యూచర్‌సిటీకి కొత్త పోలీస్ కమిషనరేట్.. ప్రారంభించిన సీఎం రేవంత్
- మలేషియాలో ఘనంగా MYTA 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
- దుబాయ్‌లో నకిలీ అనారోగ్య సెలవు ధ్రువపత్రాల జారీ.. క్లినిక్ క్లర్క్‌కు జైలు శిక్ష
- నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే వీల్ క్లాంప్లు..!!







