కువైట్ లో భారీ వర్షాలు.. పలు ప్రాంతాలు జలమయం
- November 13, 2022
కువైట్: కువైట్‌లో కురిసిన భారీ వర్షాలకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వివిధ గవర్నరేట్‌లలో వర్షం కురిసిన సమయంలో 147 అత్యవసర కాల్స్ ను పరిష్కరించినట్లు కువైట్ ఫైర్ ఫోర్స్ తెలిపింది. అంతర్గత మంత్రి షేక్ తలాల్ ఖలీద్ అల్-అహ్మద్ అల్-సబా, కేఎఫ్ఎఫ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఖలీద్ రకన్ అల్-మెక్రాద్ అత్యవసర పరిస్థితులను పర్యవేక్షించారు. రోడ్లపై నిలిచిన నీరును తొలగించేందుకు హైడ్రాలిక్ పంపులను వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ప్రమాదాలు,విద్యుత్ ప్రమాదాలు, పడిపోయిన చెట్ల కారణంగా వాహనాలలో చిక్కుకున్న 211 మందిని సురక్షితంగా రక్షించినట్లు తెలిపింది. జహ్రా, ఫర్వానియా, క్యాపిటల్, హవల్లీ గవర్నరేట్‌ల నుండి అత్యధికంగా అత్యవసర కాల్స్ వచ్చాయని పేర్కొంది. కువైట్ సిటీలో 5.8 మిమీ, సాల్మియాలో 6.6 మిమీ, జహ్రాలో 5.6 మిమీ వర్షం కురిసిందని కువైట్ వాతావరణ శాఖ అధికారి అబ్దుల్ అజీజ్ అల్-ఖరావి తెలిపారు. అత్యధికంగా రాబియాలో 24.4 మి.మీ వర్షపాతం నమోదైయినట్లు తెలిపారు. జాబ్రియాలో 10 మిమీ కంటే ఎక్కువ వర్షపాతం కురిసిందన్నారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







