టీ20 వరల్డ్ కప్ కైవసం చేసుకున్న ఇంగ్లండ్
- November 13, 2022
ఆస్ట్రేలియా: టీ20 వరల్డ్ కప్ 2022 ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ విశ్వవిజేతగా అవతరించింది. ప్రత్యర్థి పాకిస్తాన్ నిర్దేశించిన 138 పరుగుల విజయ లక్ష్యాన్ని 19 ఓవర్లలో ఇంగ్లండ్ బ్యాటర్లు చేధించారు. టార్గెట్ స్వల్పమే అయినా మ్యాచ్‌ను నిలబెట్టుకునేందుకు పాకిస్తాన్ బౌలర్లు విశ్వప్రయత్నం చేశారు. కానీ కీలక సమయాల్లో వికెట్లు పడకపోవడంతో ఇంగ్లండ్ గెలుపు ఖాయమైంది. ఇంగ్లండ్ బ్యాటర్లలో బెన్ స్టోక్స్ అద్భుతంగా రాణించాడు. ఫైనల్ మ్యాచ్.. అందులోనూ ఛేజింగ్‌లో ఒత్తిడి తట్టుకుని ఇంగ్లండ్‌ను విజయ తీరాలకు చేర్చాడు. 49 బంతుల్లో 52 పరుగులు కొట్టి చివరి వరకూ క్రీజులో నిలబడ్డాడు.
ఇంగ్లండ్ బ్యాటింగ్: జాస్ బట్లర్ (26), అలెక్స్ హేల్స్ (1), ఫిలిప్ సాల్ట్ (10), బెన్ స్టోక్స్ (52 నాటౌట్), హ్యారీ బ్రూక్స్ (20), మొయిన్ అలీ (19), లియామ్ లివింగ్ స్టోన్ (1 నాటౌట్) చొప్పున పరుగులు చేశారు.
టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు బ్యాటింగ్ తేలిపోయింది. ఇంగ్లండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేసింది. కీలక మ్యాచ్‌లో పాక్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు ‘క్యూ’ కట్టారు. షాన్ మసూద్ చేసిన 38 పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోర్ అంటే ఏ స్థాయిలో పాక్ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారో అర్థం చేసుకోవచ్చు. ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ కూడా సామ్ కర్రాన్ బౌలింగ్‌లో బౌల్డ్‌గా వెనుదిరిగాడు. మరో ఓపెనర్, పాక్ కెప్టెన్ బాబర్ అజమ్ కూడా 32 పరుగులకే అడిల్ రషీద్ బౌలింగ్‌లో క్యాచ్‌గా చిక్కి ఔట్ అయ్యాడు. దీంతో.. పాకిస్థాన్ జట్టు 45 పరుగులకే రెండు కీలక వికెట్లను కోల్పోయింది. మహ్మద్ హారిస్ 8 పరుగులు, ఇఫ్తికర్ అహ్మద్ అయితే డకౌట్‌గా వెనుదిరిగి పాక్ అభిమానులను తీవ్ర నిరాశపరిచాడు. షాన్ మసూద్ ఒక్కడే 28 బంతుల్లో 38 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. షాదాబ్ ఖాన్ 20 పరుగులు, మహ్మద్ నవాజ్ 5, మహ్మద్ వసీమ్ జూనియర్ 4 పరుగులకే చేతులెత్తేశారు. ఇలా.. పాకిస్థాన్ ఓపెనర్ల నుంచి మిడిలార్డర్ వరకూ ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి కకావికలమైంది.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్‌కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్‌లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్‌లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







