మెగా అప్‌డేట్.! లెట్స్ రెడీ ఫర్ ‘బాస్ పార్టీ’.!
- November 14, 2022
మెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతికి ‘వాల్తేర్ వీరయ్య’గా సందడి చేయనున్న సంగతి తెలిసిందే. బాబీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది.
మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. కాగా, సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేశారు ‘వీరయ్య అండ్ టీమ్’. ఇందులో భాగంగానే సినిమాలోని ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయాలనుకుంటున్నారట.
ఈ విషయాన్ని తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ వెల్లడించారు. ‘లెట్స్ రెడీ ఫర్ బాస్ పార్టీ..’ అంటూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇప్పుడే సాంగ్ చూశా.. సాంగ్‌లో బాస్ ఎనర్జీకి దిమ్మ తిరిగిపోయింది..’ అంటూ దేవిశ్రీ ఆ పోస్ట్ల్‌లో వివరించారు.
కాగా, రీసెంట్‌గా బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతెలాపై చిరంజీవితో ఓ స్పెషల్ సాంగ్ చిత్రీకరించిన సంగతి తెలిసిందే. ఈ సాంగ్‌నే త్వరలో రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ చిత్రీకరణ టైమ్‌లో ఆసక్తికరమైన అంశాలు బయటికి వచ్చాయ్. ఇక, ఈ ఊరమాస్ సాంగ్ విజువల్‌గా ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేయనుందో చూడాలి మరి.
తాజా వార్తలు
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్‌సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!









