బిగ్‌బాస్ డబుల్ ట్విస్ట్.! ఇద్దర్ని బయటికి పంపించేశాడహో.!
- November 14, 2022
బుల్లితెర మెగా గేమ్ షో బిగ్‌బాస్ 70 రోజులు పూర్తి చేసుకుంది. లేటెస్ట్ ఎపిసోడ్లో భాగంగా ఎలిమినేషన్‌కి సంబంధించి ట్విస్ట్ ఇచ్చాడు బిగ్‌బాస్.
డబుల్ ఎలిమినేషన్ పేరు చెప్పి, ఇద్దరిని హౌస్ నుంచి బయటికి పంపించేశాడు. ఒకరు బాలాదిత్య కాగా, మరొకరు వాసంతి. హౌస్‌కి పెద్దగా, పెదరాయుడి పాత్ర పోషించిన బాలాదిత్యను ఎలిమినేట్ చేయడం నిజంగా షాకింగ్ అంశమే. టాప్ 3లో బాలాదిత్య వుంటాడని అనుకున్నారంతా.
కానీ, గీతూ రాయల్‌తో బాలాదిత్య గొడవ ఎపిసోడ్‌తోనే ఆయనను హౌస్ నుంచి పంపించేశారనే ఆరోపణలున్నాయ్. బయటికొచ్చిన బాలాదిత్య మాత్రం ఆ ఇష్యూకి ఎలిమినేషన్‌తో ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చాడు.
అలాగే, బిగ్‌బాస్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న వాసంతి కూడా హౌస్ నుంచి వెళ్లిపోవడంతో హౌస్‌లో కాస్త గ్లామర్ తగ్గిందనే చెప్పాలి. 10 మంది కంటెస్టెంట్లతో ప్రస్తుతం హౌస్ రన్ అవుతోంది.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







