ఖతార్‌లో ఫిఫా ప్రపంచకప్ టిక్కెట్ల రీసేల్.. ముగ్గురు అరెస్ట్
- November 14, 2022
దోహా: ఫిఫా వరల్డ్ కప్ ఖతార్ 2022 కోసం అనధికారిక ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా టిక్కెట్లను రీసేల్ చేసినందుకు ఖతార్ భద్రతా అధికారులు వేర్వేరు దేశాలకు చెందిన ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ప్రపంచ కప్ టిక్కెట్లను ఫిఫా, ఆతిథ్య దేశం ఆమోదించిన నిర్దిష్ట అవుట్లెట్ల ద్వారా మాత్రమే తిరిగి విక్రయించాలి. ఫిఫా ఫుట్ బాల్ ప్రపంచకప్ టిక్కెట్లను జారీ చేయడానికి, పంపిణీ చేయడానికి, విక్రయించడానికి ఖతార్ కు మాత్రమే ప్రత్యేక హక్కు ఉన్నది. ఈ టిక్కెట్లను రీసేల్ చేయడం చట్టరిత్యా నేరం. టిక్కెట్ల పునఃవిక్రయం ప్రక్రియను నియంత్రించే ఫిఫా చట్టాలు, విధానాలకు కట్టుబడి ఉండాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రజలకు పిలుపునిచ్చింది. సంబంధిత చట్టంలోని ఆర్టికల్ (19)/రెండవ పేరాలోని నిబంధనలను ఉల్లంఘించిన వారిపై రెండు లక్షల యాభై వేల రియాల్ల కంటే ఎక్కువ జరిమానా విధించే అవకాశం ఉందని భద్రతా అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- హోర్ముజ్‌లో సముద్ర ఉద్రిక్తతల పై 40కి పైగా దేశాలు ఆందోళన..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..Dh100,000 చొప్పున గెలిచిన ఐదుగురు..!!
- ప్రాంతీయ పరిణామాలను సమీక్షించిన అమీర్, ఇటలీ పీఎం..!!
- సౌదీ కస్టమ్స్ పోర్టులలో 59 రకాల మాదక ద్రవ్యాలు స్వాధీనం..!!
- డ్రోన్ల అమ్మకం, పంపిణీ పై కువైట్ నిషేధం..!!
- మోసపూరిత బీమా కంపెనీలపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక..!!
- సహమ్లో ఇద్దరిని రక్షించిన రెస్క్యూ టీమ్స్..!!
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్









