బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ ప్రారంభం
- November 14, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్ లో వింటర్ క్యాంపింగ్ సీజన్ ప్రారంభమైంది. శీతాకాలం గాలులు వీస్తున్న నేపథ్యంలో చాలా మంది ప్రజలు రాజధాని మనామాకు దక్షిణంగా దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న సఖిర్ ఎడారికి తరలివెళుతున్నారు. అక్కడ గుడారాలు వేసుకొని ఉంటున్నారు. కింగ్డమ్ క్యాంపింగ్ సీజన్లో చాలా మంది బహ్రెయిన్లు, ప్రవాసులు తమ స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి బహిరంగ, సురక్షితమైన వాతావరణాన్ని ఆస్వాదించడానికి ఎడారి ప్రాంతాలకు వెళతారు. సాధారణంగా క్యాంపింగ్ సీజన్ నవంబర్ నెలలో ప్రారంభమై మార్చి వరకు ఉంటుంది. సదరన్ గవర్నర్ షేక్ ఖలీఫా బిన్ అలీ అల్ ఖలీఫా మాట్లాడుతూ.. క్యాంపింగ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ప్రజా భద్రతను పర్యవేక్షించేందుకు ప్రత్యేక దళాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గూడారాల సమీపంలో అగ్నిప్రమాదాలు చోటుచేసుకోకుండా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అందరికీ సురక్షితమైన వాతావరణాన్ని అందించడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- జూలై 8 నుంచి మారనున్న విమాన సర్వీసులు
- శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్
- ఈ నెల 20 వరకు హజ్ యాత్ర
- అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
- ఒమన్‌లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్‌లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్‌లో 22 మంది అరెస్ట్..!!







