బాలకృష్ణకు వెంకయ్యనాయుడు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు..
- April 23, 2016
తెలుగు రాష్ట్రాలను పాలించిన శాతవాహన చక్రవర్తి జీవిత చరిత్ర ఆధారంగా తీస్తున్న గౌతమీపుత్ర శాతకర్ణిలో నటిస్తున్న నందమూరి బాలకృష్ణకు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. అమరావతిని రాజధానిగా చేసుకొని శాతవాహనులు పాలించారని ఆయన గుర్తు చేశారు. ఒక గొప్ప చక్రవర్తి చరిత్రను తెలుగు యువ తరానికి చూపించడానికి చేస్తున్న ఒక మంచి చొరవగా..ఈ సినిమాను వెంకయ్యనాయుడు అభివర్ణించారు.''క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అనే విభజన ఉన్నా, శాతవాహన చక్రవర్తి వచ్చిన తర్వాత మనకంటూ ఒక శకం మొదలైంది. ఆ కథాంశంతో సినిమా తీయడం అభినందనీయం. బాలకృష్ణగారి వందో చిత్రం రెండొందల రోజులు ఆడాలి. ఈ సినిమా పూర్తయిన తర్వాత మొదటి ఆటను నా కుటుంబంతో కలిసి చూసేందుకు వస్తా'' అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు కూడా పేర్కొన్న విషయం తెలిసిందే.నందమూరి బాలకృష్ణ వందో చిత్రంగా క్రిష్ దర్శకత్వంలో బిబో శ్రీనివాసరావు సమర్పణలో ఫస్ట్ ఫ్రేం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్న 'గౌతమీపుత్ర శాతకర్ణి' ప్రారంభోత్సవం శుక్రవారం హైదరాబాద్ అన్నపూర్ణా స్టూడియోలో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నటుడు చిరంజీవి కెమేరా స్విచ్చాన్ చేయగా, సీఎం కేసీఆర్ క్లాప్ ఇచ్చారు. ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు గౌరవ దర్శకత్వం వహించారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









