పాపం రియా.! మామూలు మనిషి అయ్యేదెప్పుడట.!
- November 15, 2022రియా చక్రవర్తి.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి కారణం ఈ ముద్దుగుమ్మే అంటూ ఆరోపణలు ఎదుర్కొంది. డ్రగ్స్ మాఫియాతోనూ సంబంధాలున్న ఆరోపణలతో జైలు జీవితం కూడా అనుభవించి వచ్చింది.
కష్టపడి బెయిల్‌పై బయటికి వచ్చిన రియా చక్రవర్తి ఇప్పుడిప్పుడే తన మామూలు జివితాన్ని జీవించడానికి ట్రై చేస్తోంది. గ్లామర్ రంగంలో తాను కోల్పోయిన ఉనికిని తిరిగి దక్కించుకునేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తోంది.
అలాగే, రియల్ లైఫ్‌లోనూ ఇప్పుడిప్పుడే జనంతో మమేకమయ్యేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ఇటీవల సెలబ్రిటీ పార్టీలూ, ఫంక్షన్లలో తరచూ కనిపిస్తోంది రియా చక్రవర్తి.
తాజాగా బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్ పార్టీలో ఆయనతో కలిసి కాస్త క్లోజ్‌గా మూవ్ అయ్యింది రియా చక్రవర్తి. అంతే.! నెటిజన్లు ఆమెను ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. సుశాంత్ డిప్రెషన్‌కి కారణమైన వ్యక్తుల్లో కరణ్ జోహార్ కూడా ఒకరు అన్న ఆరోపణ వుంది. అలాంటి వ్యక్తితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతావా.? అని రియాని ఆడేసుకుంటున్నారు నెట్టింట.
సినీ ఇండస్ర్టీలో ఎవరూ ఉత్తములు కారు. జరిగిపోయిందేదో జరిగిపోయింది. పోయిన సుశాంత్ సింగ్ ఎలాగూ తిరిగి రాడు. ఆ ఇన్సిడెంట్‌తో ఇంకెన్నాళ్లు రియా చక్రవర్తి శిక్ష అనుభవించాలి. ఆమె ఏం చేసినా తప్పే అనడం.. పాపం కదా.! అంటూ ఓ వర్గం నెటిజనం రియాపై సానుభూతి చూపిస్తున్నారు.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్‌లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్‌లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







