మేడ్ ఇన్ ఇండియా.! హీరో కార్తి కొత్త గెటప్ చూశారా.?
- November 15, 2022
విలక్షణ హీరోగా పేరు తెచ్చుకున్న నటుడు కార్తి. హీరోల్లో కార్తి వేరయా.. అంటే అతిశయోక్తి కాదు. తమిళ నటుడే అయినా, తెలుగు ప్రేక్షకుల్నీ విశేషంగా ఆకట్టుకున్న నటుడు కార్తి.
ఇటీవలే ‘పొన్నియన్ సెల్వన్ 1’తో ప్రేక్షకుల్ని పలకరించాడు. నిజానికి చియాన్ విక్రమ్ లీడ్ రోల్ మూవీ అయినా, ఈ సినిమాని కార్తి కారణంగానే అమితంగా ఆదరించారు ప్రేక్షకులు.
అలాగే, ‘సర్దార్’ అనే ఓ యాక్షన్ ఓరియెంటెడ్ మూవీతోనూ కార్తి ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేశాడీ మధ్య. ఇక, తాజాగా కార్తి హీరోగా ‘జపాన్’ అనే సినిమా ఇటీవలే లాంఛ్ అయిన సంగతి తెలిసిందే.
‘జపాన్ - మేడ్ ఇన్ ఇండియా’ అనే కొత్త టైటిల్‌తో రూపొందుతోన్న ఈ సినిమాలో అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటిస్తోంది. రాజు మురుగన్ దర్శకత్వం వహిస్తున్నారు.
కాగా లేటెస్టుగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్లు. రెండు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తున్నాడు ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో కార్తి. గోల్డెన్ షర్డు, మెడలో గోల్డ్ చైన్లు.. ఓ చేతిలో తుపాకీ, మరో చేతిలో గ్లోబ్ పట్టుకుని విభిన్నంగా కనిపిస్తున్నాడు ఓ లుక్‌లో కార్తి. అలాగే రెడ్ అండ్ రెడ్ అవుట్ ఫిట్‌లో ఫన్నీగా కనిపిస్తున్నాడు మరో లుక్‌లో. ఫస్ట్‌లుక్ ఆసక్తిగా వుంది. సినిమా కథా, కమామిషు ఏంటనేది లెట్స్ వెయిట్ అండ్ సీ.!
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్‌లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్‌లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







