తెలంగాణలో 2023 ప్రభుత్వ సెలవుల లిస్ట్
- November 17, 2022
హైదరాబాద్: వచ్చే ఏడాది అంటే 2023 సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ సెలవు దినాల జాబితాను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. జనరల్ సెలవులు, ఆప్షనల్ సెలవులు, వేతనంతో కూడిన సెలవుల లిస్ట్ ను ప్రకటించింది. 2023లో మొత్తం 28 జనరల్ (సాధారణ) సెలవులు ఉన్నాయి. 24 ఆప్షనల్ (ఐచ్ఛిక) హాలీడేస్ ఉన్నాయి.
ప్రభుత్వ ఉద్యోగులు సాధారణ సెలవులతో పాటు ఉన్నతాధికారుల అనుమతితో 5 మాత్రమే ఆప్షనల్ హాలిడేస్ పొందవచ్చని ప్రభుత్వం పేర్కొంది. వాటితో పాటు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పండగల కోసం, స్పెషల్ డేస్ కోసం 23 నోటిఫైడ్ సెలవులున్నాయి. ఇవన్నీ కూడా వేతనంతో కూడిన సెలవులుగా ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం.
కాగా, ఏప్రిల్ నెలలో అత్యధికంగా 16 రోజులు (5 జనరల్+5 ఆప్షనల్+1 రెండో శనివారం,5 ఆదివారాలు) సెలవులు ఉంటాయి. ఏప్రిల్ 5న బాబూ జగ్జీవన్ రామ్ జయంతి. ఏప్రిల్ 7న గుడ్ ఫ్రైడే. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి, ఏప్రిల్ 22న రంజాన్, ఏప్రిల్ 23న రంజాన్ మర్నాడు సందర్భంగా జనరల్ సెలవులు.
కాగా.. పెద్ద పండుగలైన భోగి, సంక్రాంతి, దీపావళి, రంజాన్ పండుగలు.. రెండో శనివారం, ఆదివారం వచ్చాయి. న్యూఇయర్ ఆదివారం రోజు రాగా.. భోగి పండుగ రెండో శనివారం రోజు వచ్చింది. సంక్రాంతి పండుగ కూడా ఆదివారం రోజే వచ్చింది. దీపావళి పర్వదినం సైతం ఆదివారం రోజే వచ్చింది. తెలంగాణలో అత్యంత ఘనంగా జరుపుకునే సద్దుల బతుకమ్మ పండగా అక్టోబర్ 10న వచ్చింది. విజయవదశమి సందర్భంగా అదే నెల 24న ప్రభుత్వం సెలవును ప్రకటించింది. దీపావళి సెలవును నవంబర్ 12న ప్రకటించింది ప్రభుత్వం.

తాజా వార్తలు
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్‌కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్
- యూఏఈలో అనధికార ఆన్లైన్ ఫత్వా ఖాతాల పై చర్యలు..
- సెంచరీతో చెలరేగిన డీజీపీ సీవీ ఆనంద్..
- యూఏఈలో పర్సనల్ లోన్ చెల్లింపులు నిలిచిపోతే ఏమవుతుంది?
- దుబాయ్ ఎయిర్‌పోర్టులో కొత్త స్కానర్లు..
- భారతీయులకు ఉజ్బెకిస్తాన్ బంపరాఫర్..
- మసందమ్‌లో కొత్త రహదారి..ఖసబ్-దిబ్బా ప్రయాణ సమయం 55 నిమిషాలకు తగ్గింపు
- హైదరాబాద్ లో అతిపెద్ద క్రికెట్ స్టేడియం..
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం







