ఇకపై కామెడీ చేస్తానంటోన్న జాన్వీ కపూర్.! ‘మిలి’ ట్రాక్ మార్చిందా.?
- November 17, 2022
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్, ఆన్ స్క్రీన్ అప్పియరెన్స్కీ, ఆఫ్ స్ర్కీన్ అప్పియరెన్స్కీ అస్సలు సంబంధమే లేకుండా వ్యవహరిస్తుంటుంది.
ఆఫ్ స్క్రీన్ కంప్లీట్ కమర్షియల్. అదేనండీ పక్కా గ్లామర్. ఆన్ స్ర్కీన్ పక్కా పర్ఫామర్. ఆమె ఎంచుకునే పాత్రలన్నీ కథా నేపథ్యమున్న పాత్రలే. వయసుకు మించిన పాత్రలతో డిఫరెంట్ పంథాలో వెళుతోంది జాన్వీ కపూర్.
రీసెంట్గా ‘మిలి’ అనే సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించింది. సర్వైవల్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమా కోసం జాన్వీ కపూర్ ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పని చేసే వెయిటర్ పాత్రలో కనిపించింది. అనుకోని కారణంగా 48 గంటలు ఫ్రీజర్‌లో ఇరుక్కుపోయి, తన ప్రాణాలు కాపాడుకోవడానికి ఆమె చేసిన ప్రయత్నాల్లో భాగంగా పలికించిన హావభావాలు విమర్శకుల్ని సైతం మెప్పించాయ్.
అయితే, ఇకపై జాన్వీ కపూర్ యూత్‌ఫుల్ మూవీస్‌తో సందడి చేయబోతోందట. అందులో భాగంగానే కామెడీ జోనర్‌కి సై అనిందని తెలుస్తోంది. ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ అను ఓ స్పోర్ట్స్ కామెడీలో నటిస్తోంది. రాజ్ కుమార్ ఈ సినిమాలో జాన్వీకి జోడీగా నటిస్తున్నాడు. అలాగే, ‘బవాల్’ అను మరో రొమాంటిక్ కామెడీ సినిమానూ జాన్వీ లైన్లో పెట్టింది. ఇందులో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు.
తాజా వార్తలు
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు
- యూఏఈలో సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న ఇంధన ధరలు
- కువైట్‌లో భారీగా మద్యం స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్..!!
- ఒమన్‌లో వైద్య ఫీజుల మినహాయింపు జాబితాలో మార్పులు..!!
- సౌదీలో తప్పుడు సమాచారం ఇస్తే ఐదేళ్ల జైలు..SR2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్‌లో వాట్సాప్ మెసేజ్‌లు, వాయిస్ మెసేజ్‌లు అప్పు ఆధారాలుగా పనికొస్తాయా?
- బహ్రెయిన్‌లో విషాదం.. బాత్‌టబ్‌లో పడి మూడేళ్ల భారతీయ బాలుడి మృతి..!!
- యూఏఈలో 52 మంది బిలియనీర్లు.. వీరి మొత్తం సంపద ఎంతంటే?
- యూఏఈలో భారతీయులకు బయోమెట్రిక్ డేటా మోసాలపై హెచ్చరిక







