‘అన్‌స్టాపబుల్ 2’: ఇదేం కాంబినేషన్‌రా బాబూ.! అంటూ ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.!
- November 17, 2022
బుల్లితెరపై బాలయ్య ప్రభంజనం ‘అన్‌స్టాపబుల్’ టాక్ షో. ఆహా ఓటీటీ వేదికగా ఈ టాక్ షో సక్సెస్ అయ్యింది. తొలి సీజన్ సక్సెస్ కావడంతో, మలి సీజన్‌ని అంతకంటే గ్రాండ్‌గా డిజైన్ చేసి వదిలారు.
రెండో సీజన్‌కి తొలి గెస్ట్‌గా నారా చంద్రబాబు నాయుడు ఆయన తనయుడు లోకేష్‌నీ తీసుకొచ్చి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన బాలయ్య, సెకండ్ వీక్ గెస్ట్‌లుగా శర్వానంద్, విశ్వక్ సేన్‌లతో సందడి చేశాడు.
ఇక ముచ్చటగా మూడో వీక్ బాలయ్య టాక్ షో ఎవరితో వుంటుందా.? అని ఎదురు చూస్తే, అనూహ్యంగా ఆ వీక్ ఎపిసోడ్ క్యాన్సిల్ అయ్యింది. ఇక నాలుగో ఎపిసోడ్ కోసం ముచ్చటగా ముగ్గురు గెస్ట్లలను తీసుకురాబోతున్నాడు బాలయ్య.
వాళ్లెవరో కాదు సీనియర్ హీరోయిన్ రాధిక ఒకరు కాగా, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మరియు మాజీ స్పీకర్ సురేష్ రెడ్డిలను తీసుకొస్తున్నాడనీ తాజా సమాచారం.
ఈ సమాచారంతో ఇదేం కాంబినేషన్‌రా బాబూ..! అంటూ నెటిజన్లు తలలు పట్టుకుంటున్నారు. తొలి సీజన్ మొత్తం సినీ సెలబ్రిటీలతోనే సందడి చేసిన బాలయ్య, రెండో సీజన్‌కి రాజకీయ రంగు పులిమేస్తున్నారంటూ భిన్నాభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయ్.
తాజా వార్తలు
- అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..
- శంకర నేత్రాలయ USA దత్తత గ్రామ పోషకులకు సత్కారం
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం
- వక్ఫ్ బోర్డు చట్టంలోని కొన్ని నిబంధనల పై సుప్రీం కోర్టు స్టే
- దుబాయ్ లో బ్యాంక్ ఫ్రాడ్.. అంతర్జాతీయ ముఠా అరెస్టు..!!
- సెహహతి యాప్‌లో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ బుకింగ్..!!
- కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని ఆవిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..