దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డుని అందుకోనున్నా మనోజ్‌ బాజ్‌పేయ్‌..

- April 23, 2016 , by Maagulf
దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డుని అందుకోనున్నా మనోజ్‌ బాజ్‌పేయ్‌..

బాలీవుడ్‌ నటుడు మనోజ్‌ బాజ్‌పేయ్‌ దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డుని అందుకోనున్నారు. హన్సల్‌ మెహతా దర్శకత్వం వహించిన 'అలీగర్‌' చిత్రంలో అద్భుత నటనకు గాను ఉత్తమ నటుడు విభాగంలో మనోజ్‌ ఈ అవార్డుకి ఎంపికయ్యారు.ఈ సందర్భంగా మనోజ్‌ స్పందిస్తూ 'నాపై ఇంతటి ప్రేమాభిమానాలు, ప్రశంసలు కురిపించినందుకు గాను అందరికీ కృతజ్ఞతలు' అంటూ ట్వీట్‌చేశారు. నేడు ఆయన పుట్టినరోజు కావడం విశేషం. దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డుకు ఎంపికైనందుకు గాను పలువురు బాలీవుడ్‌ నటీనటులు మనోజ్‌కు అభినందనలు తెలియజేశారు.ఆదివారం ముంబయిలో జరగనున్న ఓ కార్యక్రమంలో ఈ అవార్డును మనోజ్‌ అందుకోనున్నారు. ఈనెల 30న దాదా సాహెబ్‌ ఫాల్కే 147వ జయంతిని పురస్కరించుకుని దాదాసాహెబ్‌ ఫిల్మ్‌ ఫౌండేషన్‌ ఈ అవార్డుల ప్రదాన కార్యక్రమం నిర్వహించనుంది.ఉత్తరప్రదేశ్‌లోని అలీగర్‌ యూనివర్సిటీలో స్వలింగ సంపర్కుడైన శ్రీనివాస్‌ రామచంద్ర సిరాస్‌ అనే ఓ మరాఠా బోధకుడి మనోవ్యధను ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులకు తెలియజేశారు. ఈ చిత్రంలో ప్రధాన పాత్రను మనోజ్‌ బాజ్‌పేయ్‌ పోషించారు. ఫిబ్రవరి 26న విడుదలైన ఈ చిత్రం పలువురు విమర్శకుల ప్రశంసల్ని అందుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com