మైక్రోసాఫ్ట్, గూగుల్ సంస్థలు తమ వైఖరి మార్చుకున్నాయి
- April 23, 2016
అమెరికా టెక్నాలజీ రంగంలో దాదాపు దశాబ్దం పాటు శత్రువుల్లా ఉన్న మైక్రోసాఫ్ట్, గూగుల్ సంస్థలు తమ వైఖరి మార్చుకున్నాయి. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడానికి స్వస్తి పలికి శాంతి ఒప్పందానికి వచ్చాయి. రెండు కంపెనీలు కూడా ఇక మీదట ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోబోమని తెలిపాయి. గూగుల్‌పై చేసిన ఫిర్యాదులను వెనక్కి తీసుకుంటున్నట్లు మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. కంపెనీ న్యాయపరమైన ప్రాధాన్యతలను మార్చుకోవడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. లీగల్ ప్రొసీడింగ్స్‌లో కాకుండా మెరిట్స్, ఉత్పత్తుల్లో పోటీ పడతామని గూగుల్ వెల్లడించింది.గూగుల్, మైక్రోసాఫ్ట్‌ల ఫిర్యాదులకు సంబంధించి యునైటెడ్ స్టేట్స్, జర్మనీల్లో 18 కేసులు ఉన్నాయి. గత సెప్టెంబరులోనే రెండు కంపెనీలు పేటెంట్ ఉల్లంఘనలకు సంబంధించి రాజీకి వచ్చాయి. ఇప్పుడు ఒకరిపై ఒకరు చేసిన రెగ్యులేటరీ ఫిర్యాదులన్నీ వెనక్కి తీసుకోవడానికి ఒప్పందం కుదిరినట్లు గూగుల్ స్పష్టంచేసింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







