అధిక లాభాల పేరుతో మహిళను Dh560,000 మోసం చేసిన వ్యక్తి
- November 18, 2022
యూఏఈ: అధిక లాభాల పేరుతో మహిళను ఓ వ్యక్తి Dh560,000 మేర మోసం చేశాడు. దీంతో బాధితురాలు అబుధాబి ఫ్యామిలీ అండ్ సివిల్ అడ్మినిస్ట్రేటివ్ కోర్టులో సదరు వ్యక్తిపై దావా వేసింది. ఆ వ్యక్తి తన నుండి మోసపూరితంగా తీసుకున్న Dh560,000 దిర్హామ్‌లను తిరిగి ఇప్పించాలని కోరింది. అలాగే తనకు జరిగిన నష్టానికి 100,000 దిర్హామ్‌లు పరిహారం చెల్లించాలని కోర్టును అభ్యర్థించింది. నిందితుడు ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ ద్వారా తనకు పరిచయం అయ్యాడని, లాభదాయకమైన వ్యాపారం గురించి తనకు తెలుసని చెప్పి తనను ఒప్పించాడని మహిళ తన దావాలో వివరించింది. తాను కూడా అదే వ్యాపారంలో పెట్టుబడి పెట్టానని ఆ వ్యక్తి చెప్పడంతో తాను అతడిని నమ్మానని ఆ మహిళ తెలిపింది. ఆ తర్వాత ఆమె Dh560,000 లను నిందితుడి బ్యాంక్ ఖాతాకు బదిలీ చేసినట్లు తెలిపింది. అనంతరం పెట్టుబడి పెట్టిన లాభాల కోసం నెలల తరబడి ఎదురుచూసినా ఫలితం లేకుండా పోయిందని ఆ మహిళ వాపోయింది. ఆ వ్యక్తి తనను మోసం చేశాడని గ్రహించిన ఆమె.. నిందితుడిపై ఇంతకుముందు క్రిమినల్ ఫిర్యాదు చేశానని, అబుధాబి క్రిమినల్ కోర్ట్ మోసం చేసిన వ్యక్తిని దోషిగా నిర్ధారించిందని మహిళ తెలిపింది. అన్ని పక్షాల వాదనలు విన్న తర్వాత సివిల్ కోర్టు న్యాయమూర్తి ప్రతివాది మహిళ నుండి మోసపూరితంగా తీసుకున్న Dh560,000 తిరిగి ఇవ్వాలని ఆ వ్యక్తిని ఆదేశిస్తూ తీర్పును ఇచ్చారు. క్రిమినల్ కోర్టు ఆ వ్యక్తికి ఇంతకుముందు Dh21,000 తాత్కాలిక పరిహారం ఇచ్చిందని స్పష్టం చేసిన న్యాయస్థానం ఫిర్యాది పరిహార దావాను తిరస్కరించింది.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్‌లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







