కేరళలో ఏపీకి చెందిన శబరిమల యాత్రికుల బస్సుకు ప్రమాదం
- November 19, 2022
అమరావతి: శబరిమల యాత్ర ముగించుకుని తిరుగు ప్రయాణంలో యాత్రికుల బస్సు పతనంమిట్ట వద్ద ప్రమాదానికి గురైన ఘటనపై ముఖ్యమంత్రి వైయస్.జగన్ సీఎంఓ అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. వారికి సరైన సహాయం అందించేలా చూడాలని ఆదేశించారు. క్షతగాత్రులకు మంచి వైద్యం అందించడమే కాకుండా, యాత్రికులకు తగిన సౌకర్యాలు కల్పించేలా చూడాలన్నారు.
ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలను సీఎంఓ అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. ఏపీకి చెందిన భక్తుల బృందం మొత్తం 3 బస్సుల్లో శబరిమల వెళ్లారని, ఈమూడు బస్సులు తిరిగి వస్తున్న సమయంలో ఈ ఉదయం 8:10 గంటలకు పతనంమిట్ట వద్ద ఒక బస్సు ప్రమాదానికి గురైందని తెలిపారు. ప్రమాదానికి గురైన బస్సులో 44 మంది ప్రయాణిస్తున్నారని, 18 మంది గాయపడ్డారని, ఇందులో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని వివరించారు. మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో వీరికి చికిత్స అందిస్తున్నామని, మిగిలిన యాత్రికులకు వసతి, భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. పతనంమిట్ట జిల్లా అధికారులతో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి తగిన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
తాజా వార్తలు
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు







