ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం...
- November 22, 2022
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా వైడ్ బాడీ బోయింగ్ 777 విమానాలు నడపటం కోసం దాదాపు 100 మంది విదేశీ పైలట్‌లను నియమించాలని యోచిస్తోంది. భారతదేశంలో పనిచేస్తున్న పైలట్‌లతో పోలిస్తే విదేశీ పైలట్‌లకు అధిక జీతాలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వ యాజమాన్యంలో ఏడు దశాబ్దాల పాటు నష్టాలను మూటగట్టుకున్న ఎయిర్ ఇండియా ఖర్చులను తగ్గించుకునేందుకు విదేశీ పైలెట్ల నియమించడం మానేసింది.దీంతో ఎయిర్ ఇండియా పైలెట్ల కొరతను ఎదుర్కొంటుంది. రాబోయే నాలుగు నెలల్లో 5 బోయింగ్ 777 విమాన సర్వీసులను ప్రవేశపెడతామని ఎయిర్ ఇండియా ప్రకటించింది.
ఈ నేపథ్యంలో, ప్రవాస పైలట్లను నియమించుకోవడానికి ఎయిర్ ఇండియా సిద్ధంగా ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.ఎయిర్ ఇండియా మరో 6-10 వైడ్-బాడీ విమానాలను ప్రవేశపెట్టాలని చూస్తోంది. ముంబై నుంచి శాన్ ఫ్రాన్సిస్కో, న్యూయార్క్ లకు నాన్‌స్టాప్ సర్వీసులను ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. బెంగళూరు నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. అవి రాబోయే కొద్ది వారాల్లో ప్రారంభమవుతాయని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- జస్టిస్ సూర్యకాంత్ కొత్త సీజేఐ!
- ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ఆధ్వర్యంలో “దండక సాహిత్యం–ఉనికి, ప్రాభవం' సభ విజయవంతం
- నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ: సీఎం చంద్రబాబు
- నవంబర్‌లో బ్యాంకులకు సెలవులే సెలవులు
- చట్టపరమైన రాజీ ప్రక్రియకు @ తరధీ యాప్..!!
- ఖతార్‌లో ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లలో తనిఖీలు..!!
- GDRFA దుబాయ్ కు 'ఉత్తమ AI గవర్నెన్స్ స్ట్రాటజీ' అవార్డు..!!
- కువైట్ లో HIV టెస్ట్ రిజల్ట్స్ ఫోర్జరీ..!!
- ఒమన్‌లో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ క్యాంపింగ్ ఏరియా..!!
- నకిలీ జాబ్, సామాజిక బీమా మోసం కేసులో ఐదుగురికి శిక్ష..!!







