ఒమన్ లో 1,300 పైగా కల్తీ వస్తువులు సీజ్
- November 22, 2022
ఒమన్: నార్త్ అల్ బతినా గవర్నరేట్‌లోని కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CPA) మూలికలు, తేనెను విక్రయించే ప్రత్యేక మూడు దుకాణాలపై దాడి చేసింది. ఈ సందర్భంగా 1,300 కంటే ఎక్కువ కల్తీ వస్తువులను స్వాధీనం చేసుకున్నది. నార్త్ అల్ బతినా గవర్నరేట్‌లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్, గవర్నరేట్‌లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ యొక్క ఫార్మాస్యూటికల్ కంట్రోల్ డిపార్ట్‌మెంట్ సహకారంతో వివిధ గవర్నరేట్‌లలో అథారిటీ చేపట్టిన తనిఖీల్లో భాగంగా 1,394 గడువు ముగిసిన, అనధికార, కల్తీ వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు అథారిటీ వెల్లడించింది. ఒమన్ సుల్తానేట్ మార్కెట్లను పర్యవేక్షించడం, సరఫరాదారులు చేసే దుర్వినియోగాలను అరికట్టడం, సమాజం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపే అనధికార వస్తువుల వ్యాప్తిని ఎదుర్కోవడం తమ తనిఖీల లక్ష్యమని అథారిటీ పేర్కొన్నది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై అన్ని చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. ఉల్లంఘనల గురించి సమాచారం తెలిస్తే అధికారులకు నివేదించాలని వినియోగదారులకు అథారిటీ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- టాటా డిజిటల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాల కోత
- ఏపీ సీఎం చంద్రబాబుకు మాజీ సీఎం వైఎస్ జగన్ లేఖ
- కొత్త లేబర్ కోడ్ల అమలు
- దుబాయ్ ఎయిర్ షో: కుప్పకూలిన భారత్ కు చెందిన తేజస్ యుద్ధవిమానం
- తెలంగాణ: 25వ తేదీన క్యాబినెట్ భేటీ
- ఏపీ ప్రజలకు శుభవార్త..
- Dh5,000 సాలరీ పరిమితి ఎత్తివేత.. బ్యాంకులు రుణాలిస్తాయా?
- ఒమన్ లో మిలిటరీ పరేడ్ వీక్షించిన ది హానరబుల్ లేడీ..!!
- నకిలీ స్మార్ట్ఫోన్ల విక్రయం..ముగ్గురు ప్రవాసులు అరెస్టు..!!
- బహ్రెయిన్ వరుసగా రోడ్డు ప్రమాదాల పై ఆందోళన..!!







