పబ్లిక్ పార్కులో విద్యార్థిని పై పడిన ఊయల: Dh700,000 పరిహారం

- November 22, 2022 , by Maagulf
పబ్లిక్ పార్కులో విద్యార్థిని పై పడిన ఊయల: Dh700,000 పరిహారం

అబుధాబి: అల్ ఐన్‌లోని పబ్లిక్ పార్క్‌లో ఆడుతుండగా తలపై ఊయల పడి తీవ్రంగా గాయపడిన బాలిక కుటుంబానికి నష్టపరిహారంగా 700,000 దిర్హామ్‌లు చెల్లించాలని అల్ ఐన్ అప్పీల్స్ కోర్టు.. పార్క్ యాజమాన్యాన్ని ఆదేశించింది. అలాగే బాలిక తండ్రికి న్యాయపరమైన ఖర్చులను కూడా చెల్లించాలని పార్క్ మేనేజ్‌మెంట్ ను కోర్టు ఆదేశించింది. దిగువ కోర్టు జారీ చేసిన మునుపటి తీర్పును సమర్థించిన అప్పీల్స్ కోర్ట్ న్యాయమూర్తి పరిహారం మొత్తాన్ని Dh400,000 నుండి Dh700,000కి పెంచారు.

కోర్టు ఫైల్స్ ప్రకారం.. అల్ ఐన్‌లోని పబ్లిక్ పార్క్ నిర్వహణ బాధ్యతలు చూసే పార్క్ మేనేజ్‌మెంట్ పై బాలిక తండ్రి దావా వేశారు. బాలికకు జరిగిన భౌతిక, నైతిక నష్టానికి  నష్టపరిహారంగా 3 మిలియన్ దిర్హామ్‌లు చెల్లించాలని డిమాండ్ చేశారు. తన కుమార్తె అల్‌ అయిన్‌లోని పబ్లిక్‌ పార్క్‌లో స్కూల్‌ ట్రిప్‌కు వెళ్లినప్పుడు ఊయల పడిందని పేర్కొన్నారు. ఈ ఘటనలో తన కుమార్తె తలకు తీవ్రగాయాలయ్యాయని తెలిపారు. ప్రమాదం కారణంగా తన కూతురు… జ్ఞాపకశక్తి లోపాలు, మతిమరుపు, తరచుగా తలనొప్పి, ఏకాగ్రత లేకపోవడం, మానసిక స్థితి తదితర సమస్యలతో ఇబ్బందులు పడిందని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com