మాదకద్రవ్యాల అక్రమ రవాణా.. ఆసియా వ్యక్తికి 10 ఏళ్ల జైలు శిక్ష
- November 22, 2022
బహ్రెయిన్: మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో ఓ ఆసియా వ్యక్తికి బహ్రెయిన్ సుప్రీంకోర్టు 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అతనికి శిక్ష అనుభవించిన తర్వాత శాశ్వత బహిష్కరణతో పాటు BD5,000 జరిమానా కూడా విధించబడింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. నిందితుడు డ్రగ్స్‌ను నిల్వ చేయడంతోపాటు విక్రయాలు నిర్వహించేవాడు. పోలీసు ప్రతినిధి రహస్యంగా నిందితుడితో సంప్రదింపులు జరిపాడు. BD200 గంజాయిని కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకున్నారు. జుఫైర్‌లో డెలివరీ ఇచ్చేందుకు నిందితుడు రాగానే పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుడి ఇంట్లో సోదాలు చేయగా.. పెద్ద మొత్తంలో గంజాయి పట్టుపడింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ క్యాపిటల్ గవర్నరేట్‌లో గంజాయిని లైసెన్స్ లేకుండా విక్రయించినట్లు, అలాగే ఉపయోగించాలనే ఉద్దేశ్యంతో స్వాధీనం చేసుకున్నట్లు నిందితుడిపై అభియోగాలు మోపింది.
తాజా వార్తలు
- టాటా డిజిటల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాల కోత
- ఏపీ సీఎం చంద్రబాబుకు మాజీ సీఎం వైఎస్ జగన్ లేఖ
- కొత్త లేబర్ కోడ్ల అమలు
- దుబాయ్ ఎయిర్ షో: కుప్పకూలిన భారత్ కు చెందిన తేజస్ యుద్ధవిమానం
- తెలంగాణ: 25వ తేదీన క్యాబినెట్ భేటీ
- ఏపీ ప్రజలకు శుభవార్త..
- Dh5,000 సాలరీ పరిమితి ఎత్తివేత.. బ్యాంకులు రుణాలిస్తాయా?
- ఒమన్ లో మిలిటరీ పరేడ్ వీక్షించిన ది హానరబుల్ లేడీ..!!
- నకిలీ స్మార్ట్ఫోన్ల విక్రయం..ముగ్గురు ప్రవాసులు అరెస్టు..!!
- బహ్రెయిన్ వరుసగా రోడ్డు ప్రమాదాల పై ఆందోళన..!!







