పబ్లిక్ పార్కులో విద్యార్థిని పై పడిన ఊయల: Dh700,000 పరిహారం
- November 22, 2022
అబుధాబి: అల్ ఐన్‌లోని పబ్లిక్ పార్క్‌లో ఆడుతుండగా తలపై ఊయల పడి తీవ్రంగా గాయపడిన బాలిక కుటుంబానికి నష్టపరిహారంగా 700,000 దిర్హామ్‌లు చెల్లించాలని అల్ ఐన్ అప్పీల్స్ కోర్టు.. పార్క్ యాజమాన్యాన్ని ఆదేశించింది. అలాగే బాలిక తండ్రికి న్యాయపరమైన ఖర్చులను కూడా చెల్లించాలని పార్క్ మేనేజ్మెంట్ ను కోర్టు ఆదేశించింది. దిగువ కోర్టు జారీ చేసిన మునుపటి తీర్పును సమర్థించిన అప్పీల్స్ కోర్ట్ న్యాయమూర్తి పరిహారం మొత్తాన్ని Dh400,000 నుండి Dh700,000కి పెంచారు.
కోర్టు ఫైల్స్ ప్రకారం.. అల్ ఐన్‌లోని పబ్లిక్ పార్క్ నిర్వహణ బాధ్యతలు చూసే పార్క్ మేనేజ్మెంట్ పై బాలిక తండ్రి దావా వేశారు. బాలికకు జరిగిన భౌతిక, నైతిక నష్టానికి నష్టపరిహారంగా 3 మిలియన్ దిర్హామ్‌లు చెల్లించాలని డిమాండ్ చేశారు. తన కుమార్తె అల్ అయిన్‌లోని పబ్లిక్ పార్క్‌లో స్కూల్ ట్రిప్‌కు వెళ్లినప్పుడు ఊయల పడిందని పేర్కొన్నారు. ఈ ఘటనలో తన కుమార్తె తలకు తీవ్రగాయాలయ్యాయని తెలిపారు. ప్రమాదం కారణంగా తన కూతురు… జ్ఞాపకశక్తి లోపాలు, మతిమరుపు, తరచుగా తలనొప్పి, ఏకాగ్రత లేకపోవడం, మానసిక స్థితి తదితర సమస్యలతో ఇబ్బందులు పడిందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!







