బాస్ పార్టీ.! శాంపిలే ఇలా వుంటే, అసలు సిసలు పండగ ఏ రేంజ్‌లో.!
- November 22, 2022
మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో ఎక్కువగా రీమేక్ సినిమాలే చేస్తూ వచ్చారు. అలాంటిది మెగాస్టార్ నటిస్తున్న స్ట్రెయిట్ మూవీ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘వాల్తేర్ వీరయ్య’. చిరంజీవికి వీరాభిమాని అయిన బాబీ, కంప్లీట్ మాస్ లుక్స్‌లోకి మార్చేశాడు చిరంజీవిని ఈ సినిమా కోసం.
సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రమోషన్లు ఆల్రెడీ స్టార్ట్ చేసేసిన సంగతి తెలిసిందే. ఇటీవల రిలీజ్ చేసిన మాసీ టీజర్ అభిమానుల్లో పూనకాలు తెప్పించేసింది.
ఇక, ఇప్పుడు బాస్ సాంగ్ పార్టీ సాంగ్.. అంటూ స్పెషల్ సాంగ్ రిలీజ్ చేస్తున్నారు. నవంబర్ 23 సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు ఈ సాంగ్ రిలీజ్ కానుంది. ఈలోపే సాంగ్ ప్రోమో రిలీజ్ చేసి ఫ్యాన్స్‌లో క్యూరియాసిటీ పెంచేసింది చిత్ర యూనిట్.
లుంగీ కట్టులో చిరంజీవి మాస్ స్టైల్ సిగ్నేచర్ స్టెప్పులు ఇరగదీసేయనున్నారనీ ఈ ప్రోమో చూస్తే అర్ధమైపోతోంది. బాలీవుడ్ భామ ఊర్వశి రౌతెలా ఈ స్పెసల్ సాంగ్ కోసం చిరంజీవితో స్టెప్పులేస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ అందించిన మాస్ మసాలా లిరిక్స్ ఫ్యాన్స్‌ని ఊపేయనున్నాయి. ఎంత ఊపినా, ఈ ఊపుడు ఇంకొన్ని గంటలు దాచుకోవల్సిందే.
తాజా వార్తలు
- టాటా డిజిటల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాల కోత
- ఏపీ సీఎం చంద్రబాబుకు మాజీ సీఎం వైఎస్ జగన్ లేఖ
- కొత్త లేబర్ కోడ్ల అమలు
- దుబాయ్ ఎయిర్ షో: కుప్పకూలిన భారత్ కు చెందిన తేజస్ యుద్ధవిమానం
- తెలంగాణ: 25వ తేదీన క్యాబినెట్ భేటీ
- ఏపీ ప్రజలకు శుభవార్త..
- Dh5,000 సాలరీ పరిమితి ఎత్తివేత.. బ్యాంకులు రుణాలిస్తాయా?
- ఒమన్ లో మిలిటరీ పరేడ్ వీక్షించిన ది హానరబుల్ లేడీ..!!
- నకిలీ స్మార్ట్ఫోన్ల విక్రయం..ముగ్గురు ప్రవాసులు అరెస్టు..!!
- బహ్రెయిన్ వరుసగా రోడ్డు ప్రమాదాల పై ఆందోళన..!!







