Dh 2,757,158 దొంగతనాన్ని అడ్డుకున్న భారతీయుడు.. సత్కరించిన పోలీసులు

- November 22, 2022 , by Maagulf
Dh 2,757,158 దొంగతనాన్ని అడ్డుకున్న భారతీయుడు.. సత్కరించిన పోలీసులు

దుబాయ్‌: దుబాయ్‌లో Dh 2,757,158 ఉన్న బ్యాగ్‌ని దోచుకోవడానికి ఒక నేరస్థుడు చేసిన ప్రయత్నాన్ని భగ్నం చేయడంలో ధైర్యసాహసాలు ప్రదర్శించినందుకు కేషుర్ కరా చవాడ కరు ఘెలా అనే భారతీయ జాతీయుడిని అతని కార్యాలయంలో దుబాయ్ పోలీసు సీనియర్ అధికారుల ప్రతినిధి బృందం ఘనంగా సత్కరించింది. నేర పరిశోధన వ్యవహారాల అసిస్టెంట్ కమాండెంట్-ఇన్-చీఫ్ హిస్ ఎక్సలెన్సీ ఎక్స్‌పర్ట్ మేజర్ జనరల్ ఖలీల్ ఇబ్రహీం అల్ మన్సూరీ నేతృత్వంలోని ప్రతినిధి బృందంలో మేజర్ జనరల్ డాక్టర్ అదెల్ అల్ సువైదీ, జెబెల్ అలీ పోలీస్ స్టేషన్ డైరెక్టర్, దుబాయ్ పోలీస్ కౌన్సిల్ ఆఫ్ పోలీస్ స్టేషన్స్ డైరెక్టర్లు ఉన్నారు. వీరితోపాటు నైఫ్ పోలీస్ స్టేషన్ డైరెక్టర్ డాక్టర్ మేజర్ జనరల్ తారిక్ తహ్లాక్, బర్ దుబాయ్ పోలీస్ స్టేషన్ డైరెక్టర్ బ్రిగేడియర్ అబ్దుల్లా ఖాదిమ్ సోరూర్, పలువురు సీనియర్ అధికారులు ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు.  

దొంగతనాన్ని అడ్డుకోవడమే కాకుండా ధైర్యంగా నిందితుడిని పెట్రోలింగ్ కార్ వచ్చే వరకు నిర్బంధించి అతనిని అరెస్టు చేయడంలో సహాయం చేసిన మిస్టర్ కేషుర్‌ను మేజర్ జనరల్ అల్ మన్సూరి అభినందించారు. అతని ప్రవర్తన సమాజం పట్ల అతనికి ఉన్న నిజమైన నిబద్ధతను,  అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడంలో అతని తెలివిని ప్రతిబింబిస్తుందని ప్రశసించారు. మిస్టర్ కేషూర్‌ని అతని కార్యాలయంలో..  అతని సహచరుల ముందు సత్కరించడం ద్వారా పొరుగువారిలో గౌరవించడం అనేది సమాజ భాగస్వామ్య భావనను బలోపేతం చేయడం, వ్యక్తులలో బాధ్యతాయుత భావాన్ని బలోపేతం చేయడంలో దుబాయ్ పోలీసుల ఆసక్తిని ప్రతిబింబిస్తుందని మేజర్ జనరల్ అల్ మన్సూరి వివరించారు.

డాక్టర్ మేజర్ జనరల్ తారిక్ తహ్లాక్ ప్రకారం.. ఇద్దరు ఆసియాకు చెందిన వ్యక్తులు వేర్వేరు బ్యాగుల్లో Dh 4,250,000 నగదును తీసుకెళుతున్నారు. నైఫ్ ప్రాంతంలో వారు ఉన్నప్పుడు నిందితుడు, అతని సహచరులు ఆసియన్లను అడ్డగించి  Dh 2,757,158 ఉన్న ఒక బ్యాగును లాక్కుని పారిపోయారు. ఇద్దరు ఆసియన్ వ్యక్తులు సహాయం కోసం అరుస్తుండగా.. మిస్టర్ కేషూర్ దొంగల వైపుగా పరుగెత్తాడు. బ్యాగున్న నిందితుడిని ధైర్యంగా ఎదుర్కొన్నాడు. పోలీసు పెట్రోలింగ్‌లు వచ్చి అరెస్టు చేసే వరకు నిందితుడిని నేలపై పిన్ చేశాడని మేజర్ జనరల్ తహ్లాక్ వివరించారు.

ఈ సందర్భంగా మిస్టర్ కేశూర్ మాట్లాడుతూ.. తన సహోద్యోగుల సమక్షంలో దుబాయ్ పోలీసు సీనియర్ అధికారులు తనను గౌరవించడం సంతోషంగా ఉందన్నారు. తన జీవితంలో ఈ సత్కారం ఎప్పటికీ గొప్ప గౌరవంగా నిలిచిపోతుందన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com