అర్జెంటీనా పై సౌది అరేబియా సంచలన విజయం
- November 22, 2022
దోహా: ఫుట్‌బాల్ క్రీడలో అర్జెంటీనా ఎంత మందికి హార్ట్ ఫేవరెటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అసవరం లేదు. పైగా ప్రపంచ దిగ్గజ ఆటగాడు మెస్సీ ఉన్న టీం. సహాజంగానే అందరి కళ్లు అర్జెంటీనాపైనే ఉంటాయి. అలాంటి టీంకు సౌది అరేబియా షాకిచ్చింది. ఖతార్ వేదికగా జరుగుతోన్న ఫిఫా వరల్డ్ కప్‌లో అర్జెంటీనాపై సౌది అరేబియా సంచలన విజయం సాధించింది. గ్రూప్-సీలో భాగంగా మంగళవారం ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచులో 2-1 తేడాతో అర్జెంటీనాను సౌది అరేబియా ఓడించింది. అర్జెంటీనాపై సౌదీకి ఇదే తొలి విజయం.
ఈ మ్యాచ్‌కు ముందు అర్జెంటీనా 2019 నుంచి ఇప్పటి వరకు వరుసగా 36 మ్యాచ్‌లలో గెలుస్తూ వచ్చింది. మరో మ్యాచ్ గెలిస్తే ఇటలీ (37 వరుస విజయాలు) రికార్డును సమం చేసేవాళ్లు. కానీ సౌదీ అరేబియా టీం ఇచ్చిన దెబ్బకు ఆ అవకాశం కోల్పోయింది అర్జెంటీనా. మ్యాచ్ ప్రారంభమడత 9వ నిమిషంలోనే అర్జెంటీనా తొలి గోల్ కొట్టింది. ఆ జట్టు దిగ్గజం మెస్సీ.. పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలిచి అర్జెంటీనాకు ఆధిక్యం ఇచ్చాడు. తొలి అర్థభాగమంతా అర్జెంటీనా హవానే నడిచింది. అయితే సెకండ్ హాఫ్‌కు వచ్చే సరికే ఆట మారిపోయింది.
సెకండ్ హాఫ్‌లో సౌది అరేబియా రెచ్చి పోయింది. సౌదీ ఆటగాళ్లు ఆల్-షెహ్రీ, ఆల్-దవాసరీ చేరో గోల్ చేసి సౌదీని విజయ తీరాలకు నెట్టారు. రెండో అర్థభాగంలో అర్జెంటీనా ఒక్కటంటే ఒక్క గోల్ కూడా చేయకపోవడం గమనార్హం. కనీసం ఎంత కష్టపడినా సౌదీని అడ్డుకోలేకపోయారు. రెండో హాఫ్ మొదలయ్యాక ఆట 47వ నిమిషంలో అల్ షెహ్రీ గోల్ కొట్టాడు. 57వ నిమిషంలో అర్జెంటీనా డిఫెన్స్‌ను ఛేదించుకుంటూ వెళ్లిన ఆల్ దవాసరి మరో గోల్ చేశాడు. దీంతో అర్జెంటీనాపై 2-1 తేడాతో సౌది సంచలన విజయం సాధించింది.
తాజా వార్తలు
- టాటా డిజిటల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాల కోత
- ఏపీ సీఎం చంద్రబాబుకు మాజీ సీఎం వైఎస్ జగన్ లేఖ
- కొత్త లేబర్ కోడ్ల అమలు
- దుబాయ్ ఎయిర్ షో: కుప్పకూలిన భారత్ కు చెందిన తేజస్ యుద్ధవిమానం
- తెలంగాణ: 25వ తేదీన క్యాబినెట్ భేటీ
- ఏపీ ప్రజలకు శుభవార్త..
- Dh5,000 సాలరీ పరిమితి ఎత్తివేత.. బ్యాంకులు రుణాలిస్తాయా?
- ఒమన్ లో మిలిటరీ పరేడ్ వీక్షించిన ది హానరబుల్ లేడీ..!!
- నకిలీ స్మార్ట్ఫోన్ల విక్రయం..ముగ్గురు ప్రవాసులు అరెస్టు..!!
- బహ్రెయిన్ వరుసగా రోడ్డు ప్రమాదాల పై ఆందోళన..!!







