వాల్మార్ట్ స్టోర్లో దుండగుడు కాల్పులు..10 మంది మృతి
- November 23, 2022
అమెరికా: అమెరికాలోని వర్జీనియాలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ఓ దుండుగుడు జరిపిన కాల్పుల్లో 10మందికిపైగా మరణించినట్లు స్థానిక అధికారులు పేర్కొంటున్నారు. మరికొందరికి గాయాలయ్యాయి. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 10.12గంటల సమయంలో చెసాపిక్లోని వాల్మార్ట్ స్టోర్లో దుండగులు కాల్పులకు తెగబడ్డాడు. విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ప్రజలు భయంతో కేకలువేస్తూ పరుగులు పెట్టారు.
చెసాపిక్ పోలీస్ విభాగం అధికార ప్రతినిధి లియో కొసినిస్కీ మాట్లాడుతూ.. విచక్షణారహితంగా కాల్పులు జరిపి పలువురు మృతికి కారణమైన దుండగుడిని హతమార్చినట్లు తెలిపారు. దుండగుడు దాదాపు సుమారు అర్ధగంట పాటు కాల్పులు జరిపాడని, ఈ కాల్పుల్లో 10మంది కంటే ఎక్కువ మంది మరణించలేదని తాము విశ్వసిస్తున్నామని తెలిపాడు.
వర్జీనియా రాష్ట్ర సెనేటర్ లూయిస్ లూకాస్ మాట్లాడుతూ.. ఈ రాత్రి వర్జీనియాలోని చెసాపిక్ లోని వాల్ మార్ట్ లో దుండగుడు కాల్పులు జరపడం తనను దిగ్భ్రాంతికి గురిచేసింది. మన దేశంలో చాలా మంది ప్రాణాలను తీసిన ఈ తుపాకీ హింస మహమ్మారిని అంతం చేయడానికి పరిష్కారాలను కనుగొనే వరకు నేను విశ్రమించను అని ఆమె ట్విటర్ లో పేర్కొంది.
🚨#BREAKING: A Walmart manager has shot multiple employees ⁰
— R A W S A L E R T S (@rawsalerts) November 23, 2022
📌#Chesapeake l #VA ⁰
Police are to responding to multiple fatalities and injuries inside a Walmart superstore in VA with officials saying the Manager at Walmart Started to open fire shooting Multiple employees inside pic.twitter.com/JgnCleOvz3
తాజా వార్తలు
- టాటా డిజిటల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాల కోత
- ఏపీ సీఎం చంద్రబాబుకు మాజీ సీఎం వైఎస్ జగన్ లేఖ
- కొత్త లేబర్ కోడ్ల అమలు
- దుబాయ్ ఎయిర్ షో: కుప్పకూలిన భారత్ కు చెందిన తేజస్ యుద్ధవిమానం
- తెలంగాణ: 25వ తేదీన క్యాబినెట్ భేటీ
- ఏపీ ప్రజలకు శుభవార్త..
- Dh5,000 సాలరీ పరిమితి ఎత్తివేత.. బ్యాంకులు రుణాలిస్తాయా?
- ఒమన్ లో మిలిటరీ పరేడ్ వీక్షించిన ది హానరబుల్ లేడీ..!!
- నకిలీ స్మార్ట్ఫోన్ల విక్రయం..ముగ్గురు ప్రవాసులు అరెస్టు..!!
- బహ్రెయిన్ వరుసగా రోడ్డు ప్రమాదాల పై ఆందోళన..!!







