హన్సిక పెళ్లి సందడి మొదలయ్యిందోచ్.!
- November 23, 2022
‘దేశముదురు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్‌గా పరిచయమైన ముద్దుగుమ్మ హన్సిక. తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టడంతో పాటూ, స్టార్ హీరోల సరసన నటించి తనదైన ముద్ర వేసుకుంది. తెలుగుతో పాటూ, తమిళంలోనూ స్టార్ హోదా దక్కించుకున్న హన్సిక త్వరలో ఓ ఇంటిది కాబోతోంది.
తన చిన్ననాటి స్నేహితుడు సోహైల్‌ని హన్సిక వివాహమాడబోతోంది. డిశంబర్ 4 న వీరి వివాహం ఘనంగా జరిపించేందుకు పెద్దలు నిశ్చయించారు. అందులో భాగంగా, తాజాగా దుర్గాదేవి పూజతో హన్సిక ఇంట పెళ్లి పనులు మొదలయ్యాయ్. ఈ తాజా ఈవెంట్‌లో హన్సిక, సోహైల్ సాంప్రదాయ దుస్తులు ధరించి ఫోటోలకు పోజిచ్చారు. ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయ్.
కాగా, డిశంబర్ 4న రాజస్థాన్, జైపూర్‌లోని ఓ పురాతన రాజకోటలో హన్సిక, సోహైల్ వివాహ వేడుకకు వేదిక కానుంది. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా హన్సిక వివాహం జరగనుంది.
తాజా వార్తలు
- టాటా డిజిటల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాల కోత
- ఏపీ సీఎం చంద్రబాబుకు మాజీ సీఎం వైఎస్ జగన్ లేఖ
- కొత్త లేబర్ కోడ్ల అమలు
- దుబాయ్ ఎయిర్ షో: కుప్పకూలిన భారత్ కు చెందిన తేజస్ యుద్ధవిమానం
- తెలంగాణ: 25వ తేదీన క్యాబినెట్ భేటీ
- ఏపీ ప్రజలకు శుభవార్త..
- Dh5,000 సాలరీ పరిమితి ఎత్తివేత.. బ్యాంకులు రుణాలిస్తాయా?
- ఒమన్ లో మిలిటరీ పరేడ్ వీక్షించిన ది హానరబుల్ లేడీ..!!
- నకిలీ స్మార్ట్ఫోన్ల విక్రయం..ముగ్గురు ప్రవాసులు అరెస్టు..!!
- బహ్రెయిన్ వరుసగా రోడ్డు ప్రమాదాల పై ఆందోళన..!!







