సుడిగాలి సుధీర్.! ‘గాలోడు’ హవా మామూలుగా లేదుగా.!

- November 23, 2022 , by Maagulf
సుడిగాలి సుధీర్.! ‘గాలోడు’ హవా మామూలుగా లేదుగా.!

బుల్లితెర పై కమెడియన్‌గా సుడిగాలి సుధీర్‌కి పెద్దగా పరిచయం అక్కర్లేదు. కానీ, ఇప్పుడు ఆయన హీరో అయిపోయాడు. అంటే, గతంలోనూ కొన్ని సినిమాల్లో నటించాడనుకోండి. కానీ, ‘గాలోడు’ సినిమాతో హీరోగా సుధీర్ మంచి సక్సెస్ అందుకున్నాడు. 
దాంతో, పెద్ద తెరపైనా సుడిగాలి సుధీర్ పేరు ఇప్పుడు ఫేమస్ అయిపోయింది. గతంలోనూ హీరోగా ఒకట్రెండు సినిమాలతో పాటూ, సపోర్టింగ్ రోల్స్‌తోనూ ఆకట్టుకున్నాడు సుడిగాలి సుధీర్. 
అయితే, ‘గాలోడు’ ఇచ్చిన వుత్సాహంతో సుడిగాలి సుధీర్ వెండితెరపై బిజీ కానున్నాడట. రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘గాలోడు’ విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ధియేటర్లలో మంచి టాక్‌తో రన్ అవుతోంది. గతంలో ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ అను చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి, అప్పుడు సక్సెస్ కాకపోయినా, ఇప్పుడు మంచి సక్సెస్ కొట్టాడు. 
ఈ జోష్‌లోనే, ముచ్చటగా మూడోసారి సుధీర్‌తో కలిసి పని చేస్తానంటున్నాడీ డైరెక్టర్. ఈ సారి సుధీర్‌తో తీయబోయే చిత్రం ‘గజ్జెల గుర్రం’ అంటూ టైటిల్‌తో సహా ఆయన అనౌన్స్ చేశారు. ఈ సినిమాకి సంబంధించి స్ర్కిప్టు వర్క్ జరుగుతోందట. ఈ సినిమాలో సుధీర్‌కి జోడీగా రష్మీ గౌతమ్‌ని తీసుకోవాలనుకుంటున్నాడట రాజశేఖర్ రెడ్డి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com