చట్టవిరుద్ధంగా అబార్షన్: ఇద్దరు ప్రవాస మహిళలు అరెస్ట్
- November 24, 2022
రియాద్: చట్టవిరుద్ధమైన అబార్షన్ ప్రాక్టీస్ చేస్తున్న ఇద్దరు ప్రవాస మహిళలను రియాద్‌లో అరెస్టు చేశారు. భద్రతా అధికారుల సహకారంతో అరెస్టులు చేసినట్లు రియాద్ ఆరోగ్య శాఖ ప్రకటించింది. దక్షిణ రియాద్‌లోని అద్దె నివాస అపార్ట్‌మెంట్‌లో ఇద్దరు ప్రవాస మహిళలు చట్టవిరుద్ధంగా అబార్షన్లు చేస్తున్నట్టు గుర్తించినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. కనీస ఆరోగ్య అవసరాలు లేని వాతావరణంలో అబార్షన్లు జరిగాయని ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. రియాద్ హెల్త్ డిపార్ట్‌మెంట్‌లోని అసిస్టెన్స్ ఫర్ అసిస్టెన్స్ అధికారులు, భద్రతా అధికారుల సహకారంతో అపార్ట్‌మెంట్‌పై దాడి చేసి మహిళలను అరెస్టు చేసినట్లు తెలిపారు. రియాద్‌లోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ అఫైర్స్ డాక్టర్ హసన్ అల్-షహ్రానీ ఆదేశాలతో చట్టవిరుద్ధమైన కార్యకలాపానికి వ్యతిరేకంగా విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నట్లు రియాద్ ఆరోగ్య శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- మయన్మార్ చెర నుంచి 55 మందిని విడిపించిన ప్రభుత్వం
- మిస్ యూనివర్స్ గా థాయ్ లాండ్ సుందరి
- సాయి సన్నిధిలో ఘనంగా 11వ ప్రపంచ సదస్సు
- మనీలాండరింగ్ కు వ్యతిరేకంగా కువైట్, ఇండియా చర్చలు..!!
- సౌదీ అరేబియా, అమెరికా మధ్య స్ట్రాటజిక్ పార్టనర్షిప్..!!
- సుల్తాన్ కబూస్ రోడ్, అల్ బటినా ఎక్స్ ప్రెస్ వే ప్రారంభం..!!
- భారతి అసోసియేషన్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం..!!
- రువాండా చేరుకున్న అమీర్..!!
- అబుదాబిలో విజిటర్స్ కు 10GB ఫ్రీ సిమ్..!!
- పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము







