నవంబర్ 27 నుండి అర్ధ ఒంటెల రేసులు ప్రారంభం
- November 24, 2022
మస్కట్: రాయల్ కామెల్ కార్ప్స్ (RCC) నిర్వహించే అర్ధా ఒంటెల రేసులు నవంబర్ 27న విలాయత్ బర్కాలోని అల్ ఫెలైజ్‌లో ప్రారంభమవుతాయి. మూడు రోజులపాటు ఈ రేసులు జరుగనున్నాయి. గతంలో వలీ కార్యాలయాల్లో నమోదు చేసుకున్న థానయా, హేయెల్ వర్గాలకు చెందిన స్వచ్ఛమైన ఒమానీ అర్ధ ఆడ ఒంటెలకు మాత్రమే రేస్ లో భాగస్వామ్యం ఉంటుందని ఆర్సీసీ తెలిపింది. అర్ధా అనేది రెండు ఒంటెలు తమ రైడర్లతో కొద్ది దూరం పక్కపక్కనే పరుగెత్తే రేసు.
ఆదివారం ఉదయం మస్కట్, సీబ్, రుస్తాక్, ముసన్నా, అల్ అవబి, వాడి అల్ మావిల్, నఖ్ల్, యంకుల్, మహ్దా, అల్ బురైమి, లివా, షినాస్, సోహర్, ఇబ్రి, ధంక్ విలాయత్‌లతో రేసులు ప్రారంభం అవుతాయి. అలాగే మధ్యాహ్నం సెషన్ ఖబురా, విలాయత్ లలో ప్రారంభం అవుతాయి.
సోమవారం ఉదయం సెషన్ బిదియా, సుర్, వాడి బనీ ఖలీద్, అల్ ఖబిల్, ముదైబి, దిమా వా అల్ తయిన్, బర్కా, జలాన్ బనీ బు హసన్, జలాన్ బనీ బు అలీ, అల్ కమిల్ వా అల్ వాఫీ, ఇబ్రా విలాయాత్‌లలో రేసులు ఉంటాయి. , మధ్యాహ్నం సెషన్ సువైక్, సమైల్, బిదియా విలాయత్‌లలో నిర్వహిస్తారు. చివరి రోజు సహమ్ విలాయత్ అర్ధ ఒంటెల రేసులు నిర్వహించనున్నారు. ఒమన్ సుల్తానేట్ 2018లో గుర్రం, ఒంటె అర్ధాను యునెస్కో ఇంటాంజిబుల్ వరల్డ్ హెరిటేజ్ లిస్ట్‌లో నమోదు చేయించడంలో విజయం సాధించింది.
తాజా వార్తలు
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్లో ఫైర్సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!
- దుబాయ్లో రియల్ మార్కెట్ మందగమనంలో ఉందా? నిజమెంత?
- నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!
- ఒమన్ లో మినిస్టర్స్, అఫిషియల్స్ ప్రమాణ స్వీకారం..!!
- ఆరు నెలల్లో 1,109 మందిపై బహిష్కరణ వేటు: బహ్రెయిన్
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!







