Dh20 మిలియన్ల జాక్‌పాట్ గెలుచుకున్న భారతీయ ఇంజినీర్
- November 24, 2022
యూఏఈ: 48 ఏళ్ల ఓ భారతీయ మెకానికల్ ఇంజినీర్ దలీప్.. 20 మిలియన్ దిర్హామ్‌ల మహ్జూజ్ జాక్‌పాట్ ని గెలుచుకున్నాడు. కువైట్‌లోని స్టీల్ ఫ్యాక్టరీలో పని చేసే దలీప్.. ఇంత పెద్దమొత్తంలో జాక్ పాట్ వస్తుందని కలలో కూడా ఊహించలేదన్నారు. 12, 24, 31, 39, 49 నంబర్లతో గేమ్‌లో చేరిన తనకు విజయం వరించిందని సంతోషం వ్యక్తం చేశారు. 48 ఏళ్ల దలీప్ ఇప్పుడు తన రిటైర్మెంట్ను ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే డబ్బుతో భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్‌లోని తన స్వస్థలంలో ఒక భవనాన్ని నిర్మించబోతున్నట్లు వెల్లడించారు. అన్నింటికంటే ముందు ప్రైజ్ మనీతో సరికొత్త ఐఫోన్‌ను కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. అలాగే తన కుటుంబంతో కలిసి ప్రపంచ టూర్ కి వెళతానన్నారు.
తాజా వార్తలు
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!
- దుబాయ్‌లో రియల్ మార్కెట్ మందగమనంలో ఉందా? నిజమెంత?
- నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!
- ఒమన్ లో మినిస్టర్స్, అఫిషియల్స్ ప్రమాణ స్వీకారం..!!
- ఆరు నెలల్లో 1,109 మందిపై బహిష్కరణ వేటు: బహ్రెయిన్
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!







