జెడ్డాలోని విద్యాసంస్థలకు హాలిడే
- November 24, 2022
రియాద్: మక్కా ప్రాంతంలో నెలకొన్న వాతావరణ పరిస్థితుల కారణంగా జెడ్డా, రబీగ్, ఖులైస్లోని ప్రభుత్వ, ప్రైవేట్, అంతర్జాతీయ పాఠశాలలు గురువారం హాలిడే ప్రకటించారు. నేషనల్ సెంటర్ ఆఫ్ మెటీరియాలజీ నుండి వచ్చిన నివేదికల ఆధారంగా విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సౌదీ సివిల్ డిఫెన్స్ వెల్లడించింది. కింగ్ అబ్దుల్ అజీజ్ యూనివర్శిటీ, జెడ్డా విశ్వవిద్యాలయం కూడా అదే చర్యలు తీసుకున్నాయి. తేలికపాటి నుండి భారీ వర్షం, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని సౌదీ సివిల్ డిఫెన్స్ తెలిపింది. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, నిలిచిపోయిన వర్షపు నీరు, లోయల నుండి దూరంగా ఉండాలని పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- మనీలాండరింగ్ కు వ్యతిరేకంగా కువైట్, ఇండియా చర్చలు..!!
- సౌదీ అరేబియా, అమెరికా మధ్య స్ట్రాటజిక్ పార్టనర్షిప్..!!
- సుల్తాన్ కబూస్ రోడ్, అల్ బటినా ఎక్స్ ప్రెస్ వే ప్రారంభం..!!
- భారతి అసోసియేషన్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం..!!
- రువాండా చేరుకున్న అమీర్..!!
- అబుదాబిలో విజిటర్స్ కు 10GB ఫ్రీ సిమ్..!!
- పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- 2031 నాటికి మొబైల్ మార్కెట్లో 5G రాజ్యం
- భక్తులను తప్పుదోవ పట్టించే సంస్థలకు విరాళాలు ఇవ్వవద్దు: టీటీడీ చైర్మన్
- నాంపల్లి సీబీఐ కోర్టులో జగన్ కేసు విచారణ ముగింది







