వర్షంలో కార్లతో విన్యాసాలు: జరిమానా, వాహనాలు సీజ్
- November 24, 2022
దుబాయ్: వర్షం కురుస్తున్న సమయంలో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ విన్యాసాలు చేసినందుకు దుబాయ్ పోలీసులు పలువురు వాహనదారులకు జరిమానా విధించడంతో పాటు వారి వాహనాలను సీజ్ చేశారు. వర్షం పడుతున్న క్రమంలో ప్రమాదకరమైన డ్రైవింగ్ తో తడి రోడ్లపై విన్యాసాలు చేస్తున్న వారి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో దుబాయ్ పోలీసులు రంగంలోకి దిగారు. వాహనదారుల చర్యల కారణంగా వారి జీవితాలతోపాటు ఇతర వాహనదారుల జీవితాలు ప్రమాదంలో పడతాయన్నారు. ప్రమాదకరమైన డ్రైవింగ్ వీడియోలను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన తర్వాత నిర్లక్ష్యంగా కార్లను నడిపిన డ్రైవర్లకు జరిమానాలు విధించడంతోపాటు వాహనాలను సీజ్ చేసినట్లు ట్రాఫిక్ జనరల్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ మేజర్ జనరల్ సైఫ్ ముహైర్ అల్ మజ్రోయి తెలిపారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని మేజర్ జనరల్ అల్ మజ్రోయీ ఈ సందర్భంగా వెల్లడించారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్, లేదా ఇతర ఉల్లంఘనలను నివేదించడానికి పోలీసుల ‘వి ఆర్ ఆల్ పోలీస్’ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించాలని దుబాయ్ నివాసితులకు ఆయన పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!
- దుబాయ్‌లో రియల్ మార్కెట్ మందగమనంలో ఉందా? నిజమెంత?
- నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!
- ఒమన్ లో మినిస్టర్స్, అఫిషియల్స్ ప్రమాణ స్వీకారం..!!
- ఆరు నెలల్లో 1,109 మందిపై బహిష్కరణ వేటు: బహ్రెయిన్
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!







