చైనాలో మళ్లీ విజృంభిస్తున్న కోవిడ్..
- November 24, 2022
చైనా: చైనాలో మళ్లీ కోవిడ్ విజృంభిస్తోంది. ప్రస్తుతం రోజుకు సగటున 30,000కు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. బుధవారం ఒక్క రోజే 31,545 కేసులు నమోదయ్యాయి. వీరిలో ఎలాంటి లక్షణాలు లేని వాళ్లు 27,517 మంది వరకు ఉన్నారని అక్కడి వైద్య అధికారులు తెలిపారు.
ఒకవైపు చైనాలో అధికారులు కోవిడ్ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటూ ఉన్నప్పటికీ, కోవిడ్ భారీ స్థాయిలో ప్రబలుతోంది. లాక్ డౌన్, పర్యాటక ఆంక్షలు, మాస్ టెస్టింగ్ వంటివి చేపడుతున్నా ప్రయోజనం ఉండటం లేదు. చైనా జనాభాతో పోలిస్తే కేసుల నమోదు తక్కువ శాతంలోనే ఉన్నప్పటికీ, అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఏ ప్రాంతంలోనైనా ఒకట్రెండు కేసులు నమోదైనా సరే ఆ ప్రాంతం మొత్తం లాక్ డౌన్ విధిస్తున్నారు. కోవిడ్ సోకిన పేషెంట్లను పూర్తి స్థాయిలో క్వారంటైన్లో ఉంచుతున్నారు. మరోవైపు కోవిడ్ కారణంగా చైనా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చైనాలో లాక్ డౌన్ విధిస్తుండటం వరుసగా ఇది మూడో ఏడాది. అనేక దేశాలు కోవిడ్ నుంచి కోలుకున్నప్పటికీ, చైనా మాత్రం దీన్నుంచి బయటపడటం లేదు. చైనాలో ఒకరిద్దరికి కోవిడ్ సోకినా నగరం మొత్తం లాక్ డౌన్ విధిస్తున్నారు.
దీంతో ప్రజలకు తాగునీరు, ఔషధం, ఆహారం వంటివి కూడా అందడం లేదు. దీనిపై ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ర్యాలీలు, ధర్నాలు చేపడుతున్నారు. అయితే, వీటిని ప్రభుత్వం తీవ్రంగా అణచివేస్తోంది. అక్కడి ప్రజల ఉద్యమాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







