రాహుల్‌తో కలిసి భారత్ జోడో యాత్రలో పాల్గొన్న ప్రియాంక గాంధీ
- November 24, 2022
న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్‌లో కొనసాగుతోంది. వచ్చే ఏడాది ఎంపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు భారీగా ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ రాహుల్‌తో కలిసి యాత్రలో పాల్గొన్నారు. రాహుల్ భారత్ జోడో యాత్రలో గురువారం ఉదయం ప్రియాంక, ఆమె భర్త రాబర్ట్ వాద్రా పాల్గొన్నారు. రాహుల్ తో కలిసి అడుగులేస్తూ.. ప్రియాంక కార్యకర్తల్లో మరింత జోష్ పెంచారు. కాగా.. తమిళనాడు కన్యాకుమారిలో సెప్టెంబర్ 7న ప్రారంభమైన భారత్ జోడో యాత్ర.. కేరళ, కర్ణాటక, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర మీదుగా కొనసాగి బుధవారం మధ్యప్రదేశ్‌లోకి అడుగుపెట్టింది. అయితే, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు, పార్టీ వరుస కార్యక్రమాల వల్ల ప్రియాంక గాంధీ ఇంతకాలం భారత్ జోడో యాత్రలో పాల్గొనలేకపోయారు. తాజాగా.. మధ్యప్రదేశ్‌లో కొనసాగుతున్న యాత్రలో పాల్గొని ప్రియాంక కాంగ్రెస్ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నింపారు.
ఎంపీలో గురువారం బోర్గాన్ గ్రామం నుంచి భారత్ జోడో యాత్ర ప్రారంభమైంది. ఖర్గోన్కు వెళ్లే ముందు స్వాతంత్ర్య సమరయోధుడు, గిరిజనుల ఐకాన్ అయిన తాంతియా భీల్ జన్మస్థలాన్ని రాహుల్, కాంగ్రెస్ నేతలు సందర్శించనున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్‌ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







