OTTలో కాంతార సందడి
- November 24, 2022
రిషబ్ శెట్టి నటిస్తూ, దర్శకత్వం వహించిన డివోషనల్ కాన్సెప్ట్ మూవీ ‘కాంతార’. హోంబేలె ఫిలిమ్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సప్తమి గౌడ హీరోయిన్ గా నటించింది. సెప్టెంబర్ 30న కన్నడ విడుదలైన ఈ సినిమా అనుకోని రీతిలో స్పందన లభించడంతో.. ఇతర భాషల్లో కూడా విడుదల చేసి ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు మేకర్స్.
పాడ్ ఇండియా లెవల్ లో కూడా అద్భుతమైన విజయాన్ని నమోదు చేసి.. పుష్ప సినిమా తరువాత రీజినల్ సినిమా సత్తా ఏంటో తెలియజేసింది. ఇప్పటికే ఈ సినిమా 400 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఈ సినిమాలోని క్లైమాక్స్ అందర్నీ మరోసారి థియేటర్లకు రప్పించేలా చేసింది. అయితే ఇప్పుడు ఆ క్లైమాక్స్ ని మీ ఇంటిలోనే చూసేలా అవకాశం కలిపిస్తూ, మేకర్స్ ఓటిటి విడుదలకు వచ్చేశారు. నిన్న రాత్రి నుంచే అమెజాన్ ప్రైమ్ వీడియోలో కాంతార సందడి మొదలయింది.
విడుదలై 50 రోజులు అవుతున్నా ఈ సినిమా క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. కర్ణాటకలో రూ.168.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సాధించి రికార్డు సృష్టించింది. తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ.60 కోట్లు, తమిళనాడులో రూ.12.70 కోట్లు, కేరళలో 19.20 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.44.50 కోట్లు, బాలీవుడ్ లో రూ.96 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సాధించింది. మరి ఓటిటిలో ఎటువంటి సంచనాలు క్రియేట్ చేస్తుంది చూడాలి.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







