భారతీయ ప్రయాణికులకు గుడ్ న్యూస్

- November 24, 2022 , by Maagulf
భారతీయ ప్రయాణికులకు గుడ్ న్యూస్

యూఏఈ:  పాస్‌పోర్ట్‌లపై ఒకే పేరు ఉన్న భారతీయ ప్రయాణీకులకు సంబంధించి కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, దుబాయ్ (CGI) ఇటీవల జారీ చేసిన మార్గదర్శకాలలో మార్పులు చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా ఖాతాలో కొత్త మార్గదర్శకాలను షేర్ చేసింది. విజిట్ వీసాలు ఉన్న ప్రయాణీకులకు/విసా ఆన్ అరైవల్/ఎంప్లాయ్‌మెంట్, తాత్కాలిక వీసాలకు అర్హత ఉన్నవారికి మాత్రమే కొత్త నియమాలు వర్తిస్తాయని అందులో తెలిపింది. ప్రస్తుతం ఉన్నయూఏఈ నివాసితులకు అవి వర్తించవని స్పష్టం చేసింది. మార్పులు చేసిన ట్రావెల్ ఏజెంట్లకు ఎయిర్ ఇండియా,  ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ జారీ చేసిన సర్క్యులర్‌ను CGI షేర్ చేసింది.

సవరించిన మార్గదర్శకాలు

> ఒకటి కంటే ఎక్కువ పేర్లతో వీసా జారీ చేయబడి, రెండవ పేజీలో ప్రయాణీకుడు తండ్రి లేదా ఇంటి పేరును పేర్కొన్నట్లయితే, వారు ప్రయాణాన్ని కొనసాగించడానికి అనుమతించబడతారు.

> వీసా ఆన్ అరైవల్‌కు అర్హత ఉన్న ప్రయాణీకుల కోసం, ప్రయాణికుడు తప్పనిసరిగా రెండవ పేజీలో పేర్కొన్న తండ్రి లేదా ఇంటి పేరును కలిగి ఉండాలి.

కొత్త నిర్ణయం చాలా మంది ప్రయాణికులకు ఉపశమనం కలిగిస్తుందని అనుకుంటున్నట్లు డీరా ట్రావెల్స్ ప్రతినిధి ఫర్దాన్ హనీఫ్  తెలిపారు. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ నుండి అప్డేట్ చేసిన నియమాలు, మార్గదర్శకాలకు సంబంధించిన సర్క్యులర్లను అందుకున్నట్లు వెల్లడించారు.

పాత సర్క్యులర్ లో ఏముందంటే?

పాస్‌పోర్ట్‌లలో ఒకే పేర్ల సమస్యకు సంబంధించి ఎయిరిండియా సోమవారం ఓ సర్క్యులర్ జారీ చేసింది. "ఇంటిపేరు లేదా ఇచ్చిన పేరుతో ఒకే పేరు (పదం) ఉన్న ఏదైనా పాస్‌పోర్ట్ హోల్డర్‌ను యూఏఈ ఇమ్మిగ్రేషన్ అంగీకరించదు. ప్రయాణీకుడు INADగా(ప్రయాణానికి అనర్హుడు) పరిగణించబడతారు" అని సర్క్యులర్లో తెలిపింది. పర్యాటక వీసాలపై ప్రయాణించే సందర్శకులకు ఈ నియమం వర్తిస్తుందని పేర్కొంది. కొత్త నిబంధనను వెంటనే అమలులోకి వస్తుందని తెలిపింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com