అల్-అహ్సాలో ఒయాసిస్ ఫెస్టివల్ ప్రారంభం
- November 24, 2022
సౌదీ: సౌదీ అరేబియాలోని తూర్పు ప్రావిన్స్‌లో అల్-అహ్సా సాంస్కృతిక, వారసత్వ వారసత్వాన్ని ప్రపంచానికి తెలిపే ‘అల్-అహ్సా ఒయాసిస్ ఫెస్టివల్’ ఘనంగా ప్రారంభమైంది. అల్-అహ్సా మునిసిపాలిటీ సహకారంతో అల్-అహ్సా ఒయాసిస్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నట్లు సౌదీ అరేబియా హెరిటేజ్ కమిషన్ ప్రకటించింది. FIFA ప్రపంచ కప్ 2022తో సమానంగా ఈ ఫెస్టివల్ సందర్శకులను ఆకట్టుకుంటుందని నిర్వాహకులు తెలిపారు. ప్రపంచ కప్‌కు వేదిక ఖతార్‌కు సమీప సౌదీ నగరం అల్-అహ్సా. ప్రపంచ కప్ అభిమానులను, సౌదీ అరేబియా, ఇతర గల్ఫ్ రాష్ట్రాల నుండి ఖతార్‌కు వెళ్లే మార్గంలో అల్-అహ్సాను మీదుగా వెళ్లే సందర్శకులను ఆకర్షించడానికి విస్తృతమైన ఏర్పాట్లను చేసినట్లు అల్-అహ్సా ఒయాసిస్ ఫెస్టివల్ నిర్వాహకులు పేర్కొన్నారు. సందర్శకులు అరేబియా గుర్రపు స్వారీ యొక్క సురక్షితమైన అనుభవాన్ని ఐన్ నజ్మ్ సైట్‌లో ఆస్వాదించవచ్చు. హస్తకళలు , జానపద కళల ప్రదర్శనలు కూడా ఉంటాయి. వీటితోపాటు ఇబ్రహీం ఆర్కియాలజికల్ ప్యాలెస్, ముహైర్స్ ప్యాలెస్, హౌస్ ఆఫ్ అలీజియన్స్, అల్-అమిరియా సైట్ లు సందర్శకులను ఆకట్టుకోనున్నాయి. అల్-అహ్సా ఒయాసిస్‌ను యునెస్కో వారసత్వ ప్రదేశంగా పరిగణిస్తూ హస్తకళలు, జానపద ప్రదర్శనలతో పాటు వారసత్వం, సాంస్కృతిక సెమినార్‌లు, 3D లైట్ షోలు ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- నాన్ బహ్రెయిన్ వీడోస్ బీమా స్థితి పై అధ్యయనం..!!
- సూడాన్ యుద్ధాన్ని ముగించడానికి కృషి..ట్రంప్
- దుబాయ్, షార్జాలో పలు ఫ్లైట్స్ రద్దు, మళ్లింపు..!!
- ఒమన్ లో వాణిజ్య సంస్థ పై OMR2,800 జరిమానా..!!
- కువైట్ లో ఆరోగ్య సంరక్షణకు 'SalemApp'..!!
- ఈ వీకెండ్ ఖతార్‌లో జరిగే స్పెషల్ ఈవెంట్స్..!!
- కొలరాడోలో NATS ప్రస్థానానికి శ్రీకారం
- 'స్కిల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా’గా తెలంగాణ
- బీహార్ సీఎంగా పదోసారి నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం
- బహ్రెయిన్ లో రెండో క్లాస్ స్టూడెంట్ పై ప్రశంసలు..!!







