అందుకే వైఎస్‌ఆర్‌సిపిలో జిల్లా అధ్యక్షులను మార్చుతున్నారు: చంద్రబాబు నాయుడు
- November 24, 2022
అమరావతి: రాష్ట్రంలో పలు జిల్లాలకు పార్టీ అధ్యక్షులను మార్చుతూ సీఎం జగన్ నిర్ణయించడం తెలిసిందే. సుచరిత (గుంటూరు జిల్లా), ముత్తంశెట్టి శ్రీనివాస్ (విశాఖ), పుష్ప శ్రీవాణి (పార్వతీపురం మన్యం జిల్లా), బుర్రా మధుసూదన్ యాదవ్ (ప్రకాశం జిల్లా), చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (తిరుపతి జిల్లా), బాల నాగిరెడ్డి (కర్నూలు జిల్లా) తదితరులను జిల్లా వైసీపీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించారు.
దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. ఇటీవల కర్నూలులో తాను నిర్వహించిన పర్యటనకు యువత, ప్రజల నుంచి విశేషరీతిలో స్పందన వచ్చిందని తెలిపారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంత భారీ స్పందన ఎప్పుడూ చూడలేదని అన్నారు. దాంతో, వైఎస్‌ఆర్‌సిపిలో ప్రకంపనలు మొదలయ్యాయని, అందుకే రాష్ట్రంలో 8 జిల్లాలకు పార్టీ అధ్యక్షులను మార్చేశారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లోనూ వైఎస్‌ఆర్‌సిపి ఓడిపోవడం ఖాయమని చంద్రబాబు పేర్కొన్నారు.
మంగళగిరిలోని టిడిపి ప్రధాన కార్యాలయంలో ఆక్వా రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, ఆక్వా రంగానికి పునర్ వైభవం తెచ్చే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. ఎలాంటి పరిమితుల్లేని రీతిలో ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ రూ.1.50కే ఇస్తామని తెలిపారు. జోన్, నాన్ జోన్ విధానాలను ఎత్తివేసి ఆక్వా రంగాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి మేనిఫెస్టోలో ఆక్వా రంగం అంశాలకు కూడా చోటిస్తామని చెప్పారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







