'అ.. ఆ..' ఈ చిత్ర షూటింగ్ ముగిసింది..
- April 24, 2016
నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'అ.. ఆ..' ఈ చిత్ర షూటింగ్ ముగిసింది. ఈ విషయాన్ని నితిన్ సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ చిత్ర బృందంతో కలిసి దిగిన ఫొటోని అభిమానులతో పంచుకున్నారు. అద్భుతమైన బృందమని.. వాళ్లందరినీ చాలా మిస్ అవుతున్నానంటూ పోస్ట్ చేశాడు. ఇప్పటికే ఈ చిత్ర టీజర్ విడుదలై ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. మాటల మాంత్రికుడిగా పేరు పొందిన త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకుల ఎదురుచూస్తున్నారు.నితిన్, సమంత ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన చిత్రం అ..ఆ( అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి). హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై నిర్మితమైన ఈ చిత్రానికి ఎస్.రాధాకృష్ణ నిర్మాతగా వ్యవహరించారు. మిక్కీ జే మేయర్ సంగీత బాణీలు అందించారు. మే నెలలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







