తల్లి, ఆమె ఇద్దరు పిల్లలను గాయపరిచిన డ్రైవర్ అరెస్ట్
- November 27, 2022
సౌదీ: నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపి ఓ తల్లి, ఆమె ఇద్దరు పిల్లలు గాయపడేందుకు కారణమైన డ్రైవర్‌ను అరెస్టు చేసినట్లు మదీనాలోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ (మురూర్) తెలిపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి యాక్సిడెంట్ కు కారణమైన వాహన డ్రైవర్ ను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అతని నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా అతని వాహనం రోడ్డు పక్కన ఆగి ఉన్న రెండు వాహనాలను ఢీకొట్టింది. ఈ క్రమంలోనే నడుగుకుంటూ వెళ్తున్న తల్లి, ఆమె ఇద్దరు పిల్లలను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో వారు తీవ్రంగా గాయపడ్డారు. మదీనాలోని అల్-హమ్రా పరిసరాల్లో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు గుర్తించారు. కాగా, ఈ ప్రమాద వీడియోను సోషల్ మీడియాతో షేర్ చేసిన పలువురు నెటిజన్లు నిర్లక్ష్యపు డ్రైవర్ ని శిక్షించాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యపు డ్రైవర్‌పై చట్టం నిర్దేశించిన జరిమానాలను వర్తింపజేయడానికి ట్రాఫిక్ అథారిటీకి సూచించినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, షేక్ మొహమ్మద్ భేటీ
- నేరాల నియంత్రణకు డీజీపీ సీవీ ఆనంద్ కీలక సూచనలు
- శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్: కొలంబో నుండి కువైట్‌కు వారానికి 6 విమానాలు
- ఖతార్‌లో విద్యార్థులకు హీట్‌వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్‌లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!
- కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- మసందమ్‌లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!







